Raj Tarun : పది ప్లాపులు.. అయినా వరుస ఛాన్సులతో బిజీ!

Raj Tarun : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో ఒకడైన రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఉయ్యాలా జంపాల అనే చిత్రంతో పరిచయమైన ఈ హీరో సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే గాక, ఆ వెంటనే మరో రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి హ్యాట్రిక్ హిట్లతో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ డైరెక్టర్ అవుదామని వచ్చి ఉయ్యాలా జంపాల సినిమాకే అసిస్టెంట్ డైరెక్టర్ అయి, ఆ తర్వాత అనూహ్యంగా ఆ సినిమాకే హీరో అయ్యి లక్కీ ఛాన్స్ కొట్టిన ఈ హీరో కెరీర్ బిగినింగ్ లో వరుస హిట్లతో నిర్మాతలకు కూడా లక్కీ అయ్యాడు. అయితే ఆ తర్వాత ఆ హిట్ల పరంపర ని కంటిన్యూ చేయలేకపోయాడు. కొన్నేళ్ల కింద ఓ మోస్తరు విజయాలు అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ఆరేడేళ్లలో వరుస ప్లాపులు అందుకుని కెరీర్ లో చాలా లౌ అయిపోయాడు.

ఏకంగా పది ప్లాపులు..

కెరీర్ బిగినింగ్ లో వరుస హిట్లు కొట్టిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా సినిమాలు చేసే ధ్యాసలో ఎలా పడితే అలా రొటీన్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలను చేసి వరుస ప్లాపులు అందుకున్నాడు. అందగాడు సినిమా మొదలుకొని స్టాండప్ రాహుల్ వరకు ఏకంగా పది సినిమాలతో ప్లాపులు అందుకున్నాడు. అయితే ఏడాది పాటు సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఈ సంవత్సరం నాగార్జున నా సామి రంగ లో కీలకపాత్రలో కనిపించాడు. అయితే ఆ సినిమా హిట్ అయినా, రాజ్ తరుణ్ కి అందులో పాత్ర వల్ల ఒరిగిందేమి లేదు. ఇక ఆ మధ్య ఓటిటి లో అహనా పెళ్ళంటా వెబ్ సిరీస్ లో కూడా నటించాడు రాజ్ తరుణ్. కానీ ఏది తనకి హిట్ తెచ్చిపెట్టలేదు. కెరీర్ లో కాస్త గ్యాప్ ఇచ్చిన రాజ్ తరుణ్ ఇప్పుడు నా సామి రంగ తర్వాత మళ్ళీ జనాల్లోకి రావడంతో స్పీడ్ పెంచాడు.

వరుస సినిమాలు లైన్లో..

నా సామి రంగ తర్వాత జనాల్లో కనిపించిన రాజ్ తరుణ్ (Raj Tarun) ఇదే అదునుగా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. త్వరలో విడుదల కాబోతున్న తిరగబడరా సామి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఎ.ఎస్ రవి కుమార్ దర్శకుడు. ఇక ఆ తర్వాత భలే ఉన్నాడే పేరుతో మరో సినిమా తెరకెక్కుతుంది. శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇక తాజాగా రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమా కూడా లాంచ్ అయింది. కనెక్ట్ మూవీస్ బ్యానర్ లో కొత్త దర్శకుడు ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. రాశి సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇవే గాక మరో రెండు ప్రాజెక్టులు కూడా పెండింగ్ లో ఉన్నాయట. ఏది ఏమైనా రాజ్ తరుణ్ ఈ ఏడాది లో ఎలాగైనా హిట్టు కొట్టాలని వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు. మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తే హిట్ ఇవ్వడం ప్రేక్షకులకు పెద్ద పనేమీ కాదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు