Muralidhar Goud: డీ.జే.టిల్లు.. ఈ టైటిల్ కంటే ముందు ఏమనుకున్నారంటే..?

Muralidhar Goud.. సాధారణంగా సినిమా కథను తయారు చేసేటప్పుడే టైటిల్ ని కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి ఆ టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత అది నచ్చకపోవడం లేక మరేదైనా కారణం వల్ల టైటిల్ మారుస్తూ ఇంకొక టైటిల్ ని ఫిక్స్ చేస్తారు.. అయితే ఒక్కోసారి ముందు అనుకున్న టైటిల్సే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోని ఇప్పుడు డిజె టిల్లు పేరుతో గత రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కూడా వచ్చి ఏకంగా
రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది..

Muralidhar Goud:.J. Tillu..do you know before this title..?
Muralidhar Goud:.J. Tillu..do you know before this title..?

ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో టిల్లు తల్లిదండ్రులుగా నటించిన మురళీధర్ గౌడ్ , సుజాత ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొనీ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అలాగే సిద్ధూ జొన్నలగడ్డకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు..

డీ.జే.టిల్లు కంటే ముందు అనుకున్న టైటిల్ అదే..
ఇంటర్వ్యూలో భాగంగా మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. డీజే టిల్లు కంటే ముందు “నరుడి బ్రతుకు నటన” అనే టైటిల్ని అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే కమలహాసన్ సినిమాలోని పాటలను బ్యాగ్రౌండ్ ని కూడా సెట్ చేశాము.. అయితే అదే సమయంలో సిద్దూ తన సొంత కారుకి మొత్తం పెయింట్ వేయించి.. డిజె టిల్లు అని రాయించారు.. ఇక ఆ కారు హైదరాబాదు మొత్తం చుట్టేసి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే నరుడి బ్రతుకు నటన (NBN )అనే టైటిల్ ను మార్చి డీజే టిల్లుగా పెట్టాము ఇక సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే కదా అంటూ అసలు విషయాన్ని తెలిపారు మురళీధర్ గౌడ్.. ఇక ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒకవేళ అదే టైటిల్ పెట్టి ఉండి ఉంటే ఇక సినిమా ఎలా ఉండేదో అంటూ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ కూడా ఊహించుకోవడం గమనార్హం.

- Advertisement -

ఘోరమైన అవమానాలు పడ్డ సిద్దూ..
సిద్దు జొన్నలగడ్డ కెరియర్ గురించి కూడా మురళీధర్ మాట్లాడుతూ.. సిద్దు ఎన్నో అవమానాలు పడ్డారు. గుంటూరు టాకీస్ సినిమా సమయంలో కూడా అసలు నీ ముఖం మీద మచ్చలేంటి.. నువ్వు హీరో అవుతావా.. అంటూ చాలా దారుణంగా అవమానించారు.. ఇక ఒకానొక సమయంలో దిల్ రాజు కూడా సిద్దు ముందే కొన్ని కామెంట్లు చేశారు.. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని కసితో ఇప్పుడు సినిమా చేశారు.. ఆ కసి, పట్టుదల వల్లే నేడు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.. గోడకు విసిరిన బంతి ఎంత వేగంగా వెనక్కి వస్తుందో.. సిద్దు కూడా అంతే కసితో మళ్ళీ ఇప్పుడు స్టార్ హీరోగా నిలబడ్డారు.. సిద్దు కష్టం ఊరికే పోలేదు అంటూ సిద్దు జొన్నలగడ్డ పడ్డ కష్టం గురించి చెబుతూ అసలు విషయాలను వెల్లడించారు మురళీధర్ గౌడ్..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు