Krithi Shetty: ఆ స్టార్ హీరోకు చెల్లిగా కృతి శెట్టి ?

Krithi Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మొదటి సినిమాతోనే సక్సెస్ అవుతారన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా కెరీర్ మంచిగా మలుచుకుంటే దూసుకెళ్తారు. కానీ కొంతమంది హీరోయిన్లు చిన్న చిన్న తప్పిదాలు చేయడం వల్ల మొదటి సినిమా హిట్ అయినప్పటికీ ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్ ల హీరోయిన్ కృతి శెట్టి ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. Krithi Shetty

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో… హీరోయిన్ గా పరిచయమైంది కృతి శెట్టి. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ హీరోగా చేశాడు. ఆయన సరసన కృతి శెట్టి హీరోయిన్గా చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఉప్పెన సినిమా బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కాలేజీ అలాగే లవ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది ఈ సినిమా. కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా యూత్ , ఫ్యామిలీ అందరిని ఆకట్టుకుంది. దీంతో రికార్డుల పైన రికార్డులు సృష్టించింది ఉప్పెన సినిమా.

అయితే ఉప్పెన సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఈ తరుణంలోనే బంగారు రాజు, శ్యాం సింగరాయ సినిమాలతో వరుస విజయాలను అందుకుంది కృతి శెట్టి. అయితే ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా మంచి క్రేజ్ మాత్రం వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాల తర్వాత హీరోయిన్ కృతి శెట్టి కెరీర్ దారుణంగా తయారైపోయింది. హీరోయిన్ కృతి శెట్టి చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాఫ్ అవుతూ వచ్చాయి.

- Advertisement -
Krithi Shetty acting as for star hero sister

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, వారియర్, కస్టడీ, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ తరుణంలో కృతి శెట్టి గురించి ఆలోచించడం కానీ… ఆమెకు ఛాన్సులు ఇవ్వడానికి… దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఐరన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయిందని కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ కృతి శెట్టి అదిరిపోయే ఆఫర్ వచ్చిందట.

అయితే హీరోయిన్ గా కాకుండా చెల్లెలి పాత్ర ఆఫర్ వచ్చిందట. తమిళ ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోగా ఉన్న అజిత్ చెల్లెలిగా కృతి శెట్టి చేయనున్నారట. త్వరలోనే అజిత్ ఓ సరికొత్త సినిమా చేయబోతున్నారట. అయితే ఇందులో చెల్లెలు పాత్ర ఖాళీగా ఉందని సమాచారం. ఆ పాత్ర కోసం హీరోయిన్ కృతి శెట్టి నీ ఫైనల్ చేశారంట. Krithi Shetty

ఈ ఆఫర్కు హీరోయిన్ కృతి శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.అంతేకాదు.. ఈ సినిమాలో అజిత్ చెల్లెలుగా చేసినందుకు హీరోయిన్ కృతి శెట్టి కి భారీగానే రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు నిర్మాత ముందుకు వస్తున్నారట. డబ్బులు బాగా ఇస్తుండటం తో.. వెంటనే ఈ పాత్రకు ఓకే చెప్పింది అట హీరోయిన్ కృతి శెట్టి. Krithi Shetty

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు