Prabhas : బాబు బాగా బిజీ… 6 నెలల్లోనే 3 సినిమాల షూటింగ్ ప్లాన్

Prabhas : పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ రానున్న 6 నెలల్లో క్షణం తీరిక లేకుండా బాబు బాగా బిజీ అన్పించబోతున్నారు. కేవలం 6 నెలల్లోనే 3 ప్రాజెక్టులు షూటింగ్ లను మొదలు పెట్టే సన్నాహాలు చేస్తున్నాడు రెబల్ స్టార్. మరి ఈ 6 నెలల్లో ప్రభాస్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? ఏఏ సినిమాలను ఆయన పట్టాలెక్కించబోతున్నారు? అనే వివరాల్లోకి వెళితే…

6 నెలల్లో 3 సినిమాలు…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. కల్కి 2898 ఏడి, రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, హను రాఘవపూడితో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్. వీటిలో కొన్ని సినిమాలనైనా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ప్రభాస్. రానున్న 2 వరకు ఫుల్ బిజీబిజీగా ఉండబోతున్న రెబల్ స్టార్ పలు సినిమాల షూటింగులను మాత్రం 2025 కల్లా పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి షూటింగ్ పూర్తి కాగా, రాజా సాబ్ మూవీ నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటోంది. సలార్ 2 మూవీ షూటింగ్ మే లేదా జూన్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ లో డైరెక్టర్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు ప్రభాస్. రెబల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కి మూవీ రిలీజ్ అయ్యాక, వెంటనే ఈ మూడు సినిమాలపై దృష్టి పెట్టబోతున్నారు ప్రభాస్.

ఏ సినిమా ఎప్పుడు రాబోతోంది అంటే?

మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీని 2025 ప్రథమార్థంలో, సలార్ 2 మూవీని 2025 ద్వితీయార్థంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, హను రాఘవపూడి మూవీ 2026లో రిలీజ్ కాబోతున్నాయి. అంటే మరో రెండేళ్లలో 4 పెద్ద సినిమాలతో నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరించడానికి ప్రభాస్ రెడీ అవుతున్నారు. మరి రెబల్ స్టార్ వేసుకున్న ఈ లెక్కలన్నీ అనుకున్నట్టుగా జరిగితే 2026 వరకు ఏడాదికి రెండు సినిమాలతో రెబల్ స్టార్ అభిమానులు ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు.

- Advertisement -

ఒక్కో సినిమా ఒక్కో జానర్…

ఇక ఇక్కడ గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో రూపొందుతోంది. సలార్ 2 యాక్షన్ థ్రిల్లర్ కాగా, రాజా సాబ్ హా ర్రర్ కామెడీ మూవీ. ఇక కల్కి 2898 సైన్స్ ఫిక్షన్ సినిమా అన్న విషయం తెలిసిందే. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. స్పిరిట్ మరో యాక్షన్ ఎంటర్టైనర్ కాబోతోంది. మొత్తంగా ఒక్కో సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్జేషన్ ఒక్కో రకంగా ఉండబోతోంది. అలాగే సేమ్ జానర్స్ సినిమాలు వెంట వెంటనే రిపీట్ కాకుండా ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి రానున్న రెండేళ్ల కోసం ఇప్పటి నుంచే అదిరిపోయే మాస్ ప్లాన్ వేస్తున్నాడు రెబల్ స్టార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు