Jr NTR Bollywood Plan : కరణ్‌ను అడ్డుపెట్టుకుని జూనియర్ ప్లాన్… వార్2 కు ముందే బీ టౌన్‌పై వార్

Jr NTR Bollywood Plan : బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ను అడ్డు పెట్టుకుని జూనియర్ వేస్తున్న ప్లాన్స్ తెలిస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. తారక్ లెక్కలు తెలిస్తే బాలీవుడ్ హీరోల కంటిమీద కునుకు మాయమవ్వడం ఖాయం. మరి ఇంతకీ వాళ్ళని భయపెట్టేలా ఎన్టీఆర్ వేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

కరణ్ జోహార్ తో కలిసి తారక్ మాస్టర్ ప్లాన్…

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ ప్యాన్ ఇండియా మూవీ నార్త్ థియేటర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ చేతికి వెళ్లడంపై తారక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరణ్ చేతిలోనే తారక్ ఈ మూవీ రైట్స్ పెట్టడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఫస్ట్ ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి హిందీ వెర్షన్ ను ధర్మ ప్రొడక్షన్స్ కు అప్పజెప్పారు రాజమౌళి. ఆ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. బాహుబలి మూవీకి హిందీ మార్కెట్లో భారీ హైప్, అద్భుతమైన బజ్ క్రియేట్ చేయడంలో కరణ్ జోహార్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పొచ్చు.

ఈ నేపథ్యంలోనే అనిల్ తడాని ఏఏ ఫిలిమ్స్ తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ దేవర మూవీని ఉత్తర భారత దేశంలో పంపిణీ చేయడానికి ముందుకు రావడం విశేషం. సాధారణంగానే కరణ్ జోహార్ తనకు సంబంధం ఉన్న సినిమాలను ఊహించని రేంజ్ లో ప్రమోట్ చేస్తాడు. కాబట్టి దేవర మూవీతో నిస్సందేహంగా ఎన్టీఆర్ నార్త్ అభిమానుల మనసు దోచుకోవడం ఖాయం.

- Advertisement -

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది…

ట్రిపుల్ ఆర్ మూవీ ఘన విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన స్థానాన్ని పదిల పరుచుకోవడానికి ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయలేదు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా వాట్ 2కు సైన్ చేశాడు. ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు ఇదే ఫస్ట్ డైరెక్ట్ హిందీ మూవీ కానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ వార్ 2 కంటే ముందే నార్త్ మార్కెట్లో తనకంటూ ఓ పత్యేకమైన స్థానాన్ని దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా.

బాలీవుడ్ లోని అత్యంత ఎఫెక్టివ్ సెలబ్రిటీలలో ఒకరైన కరణ్ జోహార్ తో దేవరతో ముందడుగు వేశాడు. ఈ మూవీ రిలీజ్ కి కరణ్ జోహార్ ఇచ్చే సపోర్ట్ తో నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ కు అద్భుతమైన మార్కెట్ క్రియేట్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మూవీతో ఆయనకు నార్త్ లో కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక దేవరతో నార్త్ లో స్టార్ మార్కెట్ ను క్రియేట్ చేసుకుని, తన ఫస్ట్ హిందీ మూవీ వార్ 2తో రంగంలోకి దిగుతాడు ఎన్టీఆర్.

అలా వార్ 2 మూవీతో డైరెక్ట్ గా హిందీ మార్కెట్ పై అటాక్ చేస్తాడు ఎన్టీఆర్. మొత్తానికి కరణ్ జోహార్ ను పట్టుకుని, అక్కడే స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసుకుని, ఆ తర్వాత హిందీ హీరోలకు దడ పుట్టేలా బాలీవుడ్ లో కూడా పాగా వేయడానికి పెద్ద స్కెచ్చే వేశాడు యంగ్ టైగర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు