Naga Chaitanya: తన తల్లితో గొడవలు పెట్టుకుంటున్న చైతూ..?

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి కుటుంబం, కృష్ణ గారి కుటుంబం తర్వాత అక్కినేని కుటుంబానికి అంతే క్రేజ్ ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంతో ఇప్పటికి కూడా అక్కినేని కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి అడుగు పెట్టాడు. ఆయన కొడుకులుగా… అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

హీరో అఖిల్ కంటే అక్కినేని నాగచైతన్యకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటివరకు హీరో అఖిల్ కు మంచి సక్సెస్ పడలేదు. కానీ అక్కినేని నాగచైతన్యకు చాలా హిట్స్ ఉన్నాయి. అలాగే దగ్గుబాటి కుటుంబం సపోర్ట్ కూడా ఉంటుంది. వాస్తవానికి అక్కినేని నాగార్జున మొదటి భార్య కొడుకు అక్కినేని నాగచైతన్య. అమల కొడుకు అక్కినేని అఖిల్ అన్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీని మొదట అక్కినేని నాగార్జున వివాహం చేసుకున్నారు.

అయితే దగ్గుబాటి లక్ష్మీ మరియు అక్కినేని నాగార్జునకు అక్కినేని నాగచైతన్య పుట్టాడు. అయితే కొన్ని కారణాలవల్ల నాగార్జున తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. విడాకుల తర్వాత దగ్గుబాటి లక్ష్మీ దగ్గర అక్కినేని నాగచైతన్య పెరిగాడు. దాదాపు 19 సంవత్సరాల పాటు ఆమె దగ్గర నాగచైతన్య ఉన్నాడట. ఎప్పుడైతే టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడో.. అప్పటినుంచి… అక్కినేని నాగార్జున దగ్గరే ఉంటున్నాడు అక్కినేని నాగచైతన్య.

- Advertisement -

అంతేకాదు… అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహానికి కూడా దగ్గుబాటి లక్ష్మి ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చారు. దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేశారు. అయితే తాజాగా… తన తల్లికి దూరంగా… తన తండ్రికి దగ్గరగా ఉండటంపై అక్కినేని నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇటీవల పాల్గొన్నారు అక్కినేని నాగచైతన్య. ఈ సందర్భంగా… తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నారు అక్కినేని నాగచైతన్య.

అయితే మీ తల్లి దగ్గర ఎందుకు ఉండటం లేదని అక్కినేని నాగచైతన్యను సదరు యాంకర్ ప్రశ్నించారు. అయితే దీనికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వస్తున్నారని… అదే సమయంలో నేను ఇండస్ట్రీ లోకి వచ్చానని తెలిపారు. సినిమాలు చేయాలి కాబట్టి హైదరాబాదులో ఉండాలి. ప్రస్తుతం అమెరికాలో అమ్మ ఉంటుంది. నేను అమెరికాలో ఉంటే సినిమాలు చేయలేను. అందుకే నాన్న దగ్గర హైదరాబాద్ లోనే ఉంటున్నాను. తన తల్లికి నాకు ఎలాంటి గొడవలు లేవు.

మా అమ్మ ఎంతో మంచిది. ఆమె ఆలోచనలతో నేను పెరిగాను. మా కుటుంబంలో చాలా మంచిది మా అమ్మే. అప్పుడప్పుడు ఆమెను మిస్ అవుతూ ఉంటాను. ఆమె చూడాలనిపిస్తే అక్కడికి వెళ్తాను అంటూ అక్కినేని నాగచైతన్య చెప్పుకోచ్చారట. కాగా అక్కినేని నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగచైతన్య రెండవ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు