NTR look in War 2 revealed : వార్ 2లో ఎన్టీఆర్ లుక్ లీక్… కొత్త షెడ్యూల్ డిటైల్స్

NTR look in War 2 revealed : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా లీకైన పిక్ తో వార్ 2 మూవీ నుంచి ఎన్టీఆర్ లుక్ రివీల్ అయ్యింది. అలాగే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మరి ఇంతకీ తారక్ లుక్ ఎలా ఉంది? వార్ 2 షూటింగ్ ఎక్కడ, ఎన్ని రోజుల పాటు జరగబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎన్టీఆర్ లుక్ లీక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీతో హిందీలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అటు నార్త్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, ఇటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో వార్ 2 మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని తమ స్పై యూనివర్స్ లో భాగంగా యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వార్ 2 మూవీ షూటింగ్ కోసం తాజాగా ముంబైకి చేరిన తారక్ లుక్ రివీల్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వార్ 2 షెడ్యూల్ ఇదే..

ఇప్పటికే హృతిక్ రోషన్ వార్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. తారక్ ఎప్పుడెప్పుడు ఈ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతాడా అని చాలా రోజుల నుంచి నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఆ క్షణం వచ్చేసింది. తారక్ ఈ మూవీ షూటింగ్ ను శుక్రవారం అంటే ఏప్రిల్ 12 నుంచి మొదలు పెట్టనున్నాడు. ఈ కొత్త షెడ్యూల్ 10 రోజులపాటు సుదీర్ఘంగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ముంబైలోనే హృతిక్ రోషన్ తో పాటు ఎన్టీఆర్ పై కొన్ని భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు మేకర్స్. ఈ హై ఆక్టెన్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలవబోతున్నాయని సమాచారం.

- Advertisement -

మరి దేవర సంగతేంటి?

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తయింది. అక్టోబర్ 10న ఈ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. వార్ 2 కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ చివరి వారంలో దేవర సెట్స్ కు తిరిగి రాబోతున్నారు. ఈ ఏడాది చివరికల్లా వార్ 2 షూటింగ్ ను పూర్తి చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే ఈ మూవీ కోసం బరువు తగ్గిన ఆయన గత రెండు వారాలుగా సరికొత్త మేకోవర్ కోసం జిమ్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది.

2019లో విడుదలైన “వార్” మూవీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే వార్ 2 కు మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మాస్త్ర ఫేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. మేకింగ్, టేకింగ్ ఫ్రెష్ గా ఉండాలనే YRF డైరెక్టర్ ను మార్చేసింది. ఇక వార్ మూవీ క్లైమాక్స్ లో టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ చనిపోతారు. సీక్వెల్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వార్ 2 మూవీ 2025 ఆగస్ట్ 14న విడుదల అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు