Family Star First Week Collections : ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ వీక్ కలెక్షన్లు… డిజాస్టర్ అని చెప్పడానికి ఇది సరిపోదా?

Family Star First Week Collections : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో ఫ్యామిలీ స్టార్ మూవీతో మరో దారుణమైన డిజాస్టర్ పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు బయటకు వచ్చాయి. అవి చాలు విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ఇది ఒక మరిచిపోలేని ప్లాప్ మూవీగా మిగిలింది అని చెప్పడానికి. మరి ఇంతకీ ఫస్ట్ వీక్ ఫ్యామిలీ స్టార్ మూవీకి వచ్చిన కలెక్షన్లు ఎన్ని? అనే వివరాల్లోకి వెళితే…

ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన ఫ్యామిలీ స్టార్. పరుశురాం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. భారీ అంచనాల నడుమ థియేటర్లోకి వచ్చిన ఈ మూవీకి మొదటి షో నుంచే నెగటివ్ టాక్ మొదలైంది. ఆ నెగెటివిటీ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే మొదటి రోజే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పై తీవ్రమైన ప్రభావం పడింది.

గత శుక్రవారం అంటే ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి రాగా, ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. మొదటి ఏడు రోజుల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా కేవలం 30.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 11న రంజాన్ పండుగ హాలిడే ఉన్నప్పటికీ ఈ సినిమాకు కేవలం 94 లక్షలే రావడం గమనార్హం. ఇక మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి చూస్తే కనీసం ఒక్కరోజు కూడా కోటి వసూళ్లు దాటకపోవడం విజయ్ దేవరకొండ లాంటి హీరోకు మరో దారుణం. మొత్తంగా తెలుగు వెర్షన్ నెట్ కలెక్షన్లు చూస్తే 16.8 కోట్లు, తమిళంలో ఏడు రోజుల్లో 1.42 కోట్లు మాత్రమే సాధించాడు ఫ్యామిలీ స్టార్. ఓవర్సీస్ లో 9.5 కోట్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ 60 కోట్ల బడ్జెట్ తో రూపొందగా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో కచ్చితంగా విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ పై గట్టి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

- Advertisement -

ఇది చాలదా డిజాస్టర్ అనడానికి?

ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు చిత్ర బృందం మొత్తం పని గట్టుకుని ఫ్యామిలీ స్టార్ మూవీకి కొంతమంది నెగటివ్ రివ్యూ ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కానీ సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ మూవీ నచ్చలేదన్న విషయం కలెక్షన్ ను బట్టి చూస్తే అర్థమవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోయినా, వరుస సెలవులు ఉన్నప్పటికీ ఈ సినిమాని క్యాష్ చేసుకోవడంలో ఫ్యామిలీ స్టార్ దారుణంగా ఫెయిల్ అయ్యింది అనేది వాస్తవం.

విజయ్ దేవరకొండ ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్

లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ వరస ఫెయిల్యూర్స్ విజయ్ కెరీర్ కు మరింత నెగిటివ్ గా మారడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఒక ఎమర్జెన్సీ హిట్ పడితేనే ఆయన కోలుకుంటాడు. నెక్స్ట్ మూవీ VD 12కి కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే విజయ్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు