Rakul Preeth Singh New Business : కొత్త బిజినెస్ లోకి రకుల్ అడుగు… సినిమాలు మానేస్తోందా?

Rakul Preeth Singh New Business : టాలీవుడ్ లో దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. స్టార్ హీరోలతో వరుసగా జతకట్టిన ఈ కొత్త పెళ్లి కూతురు తాజాగా మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఇంతకీ రకుల్ పెట్టబోయే ఆ బిజినెస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

రకుల్ కొత్త బిజినెస్

ప్రస్తుతం చాలా మంది హీరోలు హీరోయిన్లు సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బునంతా రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఒకవేళ సినిమా అవకాశాలు తగ్గినా ఈ వ్యాపారాలతో హ్యాపీగా తమకు నచ్చిన లైఫ్ ను మెయింటైన్ చేయొచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. ఇప్పటికే పలు బిజినెస్ లు రన్ చేస్తున్న రకుల్ ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టబోతోంది. ఆరంభం పేరుతో హైదరాబాద్లోని మాదాపూర్ లో ఈనెల 16న ఫైన్ డైన్ రెస్టారెంట్ ప్రారంభించబోతోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ప్యూర్ ఫుడ్స్ తో కలిసి ఈ బిజినెస్ ను సంయుక్తంగా నిర్వహించబోతోంది రకుల్. ఇక ప్రస్తుతం హైదరాబాదులో ఎన్నో రెస్టారెంట్లు ఉండగా రకుల్ రెస్టారెంట్ కి ఎందుకు వెళ్లాలి అంటే ఇక్కడో ప్రత్యేకత ఉంది.. రకుల్ రెస్టారెంట్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తృణ ధాన్యాలతో తయారు చేసే వంటకాలు లభిస్తాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తీసుకున్న స్టెప్ తో ఆమె సినిమాలకు దూరం కాబోతోందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. కానీ ఆమె ఫ్యాన్స్ అలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆమె ఇప్పటికే పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

రకుల్ రన్ చేస్తున్న బిజినెస్ లు ఇవే

ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఫుల్ బిజినెస్ మైండెడ్. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఎస్ 45 పేరుతో జిమ్ నిర్వహిస్తోంది రకుల్. ఇప్పటికే వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్, వెల్ బీయింగ్ న్యూట్రిషన్ వంటి వాటిలో రకుల్ ప్రీత్ సింగ్ పెట్టుబడులు పెట్టింది. అలాగే 2018లో న్యూబూ పేరుతో బయో డిగ్రేడబుల్ రీయూజబుల్ డైపర్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడేమో రెస్టారెంట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతోంది.

- Advertisement -

పెళ్ళైనా తగ్గని ఆఫర్లు

ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాపారవేత్త, నిర్మాత, నటుడు, అన్నింటికీ మించి తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టింది. ఓవైపు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ, మరోవైపు పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ భారతీయుడు 2 మూవీలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ “దే దే ప్యార్ దే 2”, అజయ్ దేవగన్ సరసన హీరోయిన్ గా మరో మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం రకుల్ ఫోకస్ మొత్తం బీ టౌన్ పైనే ఉంది. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు