Ramayanam Movie : నితీష్ రామాయణంకు నిర్మాతగా యష్… బిగ్ రిస్క్ తీసుకుంటున్నాడా?

Ramayanam Movie : అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బాలీవుడ్ రామాయణంలో కన్నడ స్టార్ యష్ కూడా భాగం కాబోతున్నారు. అయితే నిన్న మొన్నటిదాకా ప్రచారం జరిగినట్టుగా హీరోగా కాకుండా ఆయన నిర్మాతగా చేయబోతున్నారంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి ఈ భారీ బడ్జెట్ మూవీకి నిర్మాతగా మారి యష్ రిస్క్ చేస్తున్నారా? అంటే…

యష్ నిర్మాతగా రామాయణం

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ మూవీ రామాయణం. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ షూటింగ్ మాత్రం సైలెంట్ గా మొదలు పెట్టేసారు మేకర్స్. శ్రీరామ నవమి సందర్భంగా రామాయణం మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా రావణుడిగా నటించబోతున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆయన ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడో లేదో తెలీదుగానీ నిర్మాతగా మాత్రం మారారు.

నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి యష్ తన సొంత బ్యానర్ అయిన మాస్టర్ మైండ్ క్రియేషన్స్ లో రామాయణ మూవీని నిర్మించబోతున్నారు. తాజాగా జరిగిన మూవీ ఈవెంట్ లో ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పేశారు రామాయణం టీం.

- Advertisement -

యష్ చిరకాల కల

ఈ సందర్భంగా యష్ మాట్లాడుతూ భారతీయ సినిమాను ప్రపంచ వేదిక మీద ఉంచాలనేది తన చిరకాల కల అనే విషయాన్ని బయట పెట్టారు. ఇక చాలాసార్లు రామాయణం మూవీని తాను నమిత్ కలిసి చేయాలని అనుకున్నామని, కానీ ఇంత పెద్ద సబ్జెక్టు తీయడం అనేది అంతా తేలికైన విషయం కాదు, బడ్జెట్ కూడా కష్టమని చెప్పుకొచ్చారు. అందుకే తను సహ నిర్మాతగా మారి ఈ మూవీని నిర్మించాలనుకున్నానని, రామాయణం కోసం ఎంతైనా కష్టపడతానని, ఇంటర్నేషనల్ స్టేజ్ పై ఈ మూవీ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు యష్. ఇక రామాయణం మూవీ కోసం యష్ సుమారు 80 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలో ఆయన రావణాసురుడిగా నటిస్తున్నారా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

యష్ రిస్క్ చేస్తున్నాడా?

రామాయణం అనేది చాలామందికి తెలిసిన కథే. బుల్లితెరపై రామాయణం ప్రయత్నం ఫలించింది. కానీ వెండితెరపై బెడిసికొట్టిన సందర్భాలెన్నో. పైగా రామాయణంలో ఏ పాయింట్ తీసుకున్నా ఓ వర్గం వారు విమర్శించడానికి రెడీగా ఉంటారు. ఆల్రెడీ రామాయణం ఆధారంగా రూపొందిన “ఆదిపురుష్” మూవీతో ప్రభాస్ కు మరిచిపోలేని చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు మళ్ళీ అదే సబ్జెక్టుపై యష్ భారీ బడ్జెట్ పెడుతున్నాడు. అందరినీ మెప్పించే విధంగా మూవీని తెరకెక్కిస్తే ఓకే. లేదా ఏమాత్రం తేడా వచ్చినా యష్ చేతులు కాల్చుకున్నట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు