Prathinidhi 2 Teaser : టీజర్లో పొలిటికల్ సెటైర్లు… దీని కోసమేనా నారా రోహిత్ ఇన్నేళ్ల అజ్ఞాతవాసం?

Prathinidhi 2 Teaser : యంగ్ హీరో నారా రోహిత్ చాలా ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత “ప్రతినిధి 2” టీజర్ తో తాజాగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కంప్లీట్ గా పొలిటికల్ సెటైర్లతో నిండిపోయిన ఈ టీజర్ ను చూశాక దీని కోసమే నారా రోహిత్ ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. 2018 తర్వాత నారా రోహిత్ సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు “ప్రతినిధి 2” మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. మరి పొలిటికల్ ఎజెండాతో తెరకెక్కుతున్న ఈ సినిమాతోనైనా నారా రోహిత్ మళ్లీ బిజీ అవుతారా? ఈ మూవీ ఆయన కెరీర్ కు ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటే…

దీని కోసమేనా అజ్ఞాతవాసం?

నారా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టిన మొట్టమొదటి హీరో నారా రోహిత్. 2009లో బాణం మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుంచి వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం పడలేదు. కమర్షియల్ గా సక్సెస్ దక్కలేదు. ఇప్పటిదాకా దాదాపు 25 సినిమాల్లో నటించిన నారా రోహిత్ హిట్స్ ను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. సోలో, ప్రతినిధి, శమంతకమని వంటి యావరేజ్ సినిమాలు తప్ప భారీ బ్లాక్ బస్టర్లు మాత్రం అందుకోలేకపోయాడు ఈ నారా హీరో. వరుసగా డిజాస్టర్లు పడుతుండడంతో 2018 తర్వాత సినిమాలకు దూరమయ్యాడు.

చివరగా నారా రోహిత్ వీర భోగ వసంత రాయలు అనే సినిమాలో కనిపించారు. ఈ మూవీకి వచ్చిన రిజల్ట్ తో నిరాశకు గురైన నారా రోహిత్ ఆ తర్వాత మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు. కానీ తాజాగా “ప్రతినిధి” సీక్వెల్ తో మళ్లీ ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యారు. తాజాగా ట్రైలర్ ను చూసిన జనాలు ఈ సినిమా కోసమే ఇంత గ్యాప్ తీసుకున్నాడా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం “ప్రతినిధి 2” లాంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా కోసమే ఇన్నేళ్ళు వెయిట్ చేశాడని, ఈసారి హిట్ పక్కా అని నమ్ముతున్నారు.

- Advertisement -

“ప్రతినిధి 2” టీజర్ ఎలా ఉందంటే?

ప్రతినిధి మూవీకి ప్రేక్షకుల నుంచి అప్పట్లో మంచి ఆదరణ దక్కింది. కానీ ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్ గా “ప్రతినిధి 2” మూవీని తెరపైకి తీసుకొస్తున్నారు. 2014లో థియేటర్లలోకి వచ్చిన ప్రతినిధి మూవీకి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. ఇప్పుడు సీక్వెల్ కు జర్నలిస్టు మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీతోనే జర్నలిస్ట్ మూర్తి డైరెక్టర్ గా మారడం విశేషం. కుమార్ రాజా బత్తుల, సురేంద్రనాథ్ బొల్లినేని, ఆంజనేయులు శ్రీ తోట “ప్రతినిధి 2” మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.

దాదాపు 6 ఏళ్ల తర్వాత “ప్రతినిధి 2” టీజర్ తో సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు నారా రోహిత్. ఇక టీజర్ కంప్లీట్ గా పొలిటికల్ ఏజెండాతో నడిచింది. టీజర్ లో డైలాగ్ లు పవర్ఫుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చిన “ఇప్పటికైనా కళ్ళు తెరవండి… ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి. లేదంటే దేశం వదిలి వెళ్ళిపోండి. కుదరకపోతే చచ్చిపోండి” అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నడుస్తున్న ఎలక్షన్ హీట్ లో రిలీజ్ అయితే “ప్రతినిధి 2” హిట్ కావడం ఖాయం అంటున్నారు నారా అభిమానులు.

ప్రజా సమస్యలు, ఓటు వినియోగం ప్రధాన పాయింట్స్ గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఆరేళ్ల గ్యాప్ తర్వాత “ప్రతినిధి 2″తో నారా రోహిత్ హిట్ కొడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఏప్రిల్ లోనే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు