ANR: అన్నపూర్ణ పిక్చర్స్ అక్కినేని సొంతం కాదా..తెర వెనుక నిజం ఇదే..!

అన్నపూర్ణ పిక్చర్స్ వెనుక ఇంత కథ ఉందా..?

ANR: సినీ సెలబ్రిటీలలో అక్కినేని నాగేశ్వరరావు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభం అయిన ఈయన ఎంతో మందితో చాలా సన్నిహితంగా మెలిగే వారు.. ఇకపోతే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో మరో హీరోతో ఫ్రెండ్షిప్ చేయవచ్చు.. హీరో దర్శకుడితో.. నిర్మాత హీరోతో ఇలా ఇండస్ట్రీలో ఎవరి మధ్య అయినా మంచి స్నేహం ఏర్పడుతుంది..ఈ క్రమంలోనే అప్పటి కాలంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ( ANR ) అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత ప్రొడ్యూసర్ దుక్కపాటి మధుసూదనరావు మధ్య ఎంతో మంచి స్నేహం ఉండేది.

అన్నపూర్ణ పిక్చర్స్ తప్ప ఆయనదే..

సాధారణంగా అన్నపూర్ణ పిక్చర్స్ అంటే అక్కినేని వారి సొంత ప్రొడక్షన్ హౌస్ అని చాలామంది అనుకుంటారు.. ఎందుకంటే ఆయన భార్య పేరు కూడా అన్నపూర్ణ కాబట్టి అందరూ అలాగే భావిస్తారు..కానీ అది నిజం కాదు.. నిజానికి అది దుక్కపాటి మధుసూదన్ రావు అమ్మగారి పేరు.. వాస్తవానికి మధుసూదన్ రావు తల్లి పేరు గంగాజలం. దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఇక దాంతో సవతి తల్లి అన్నపూర్ణను కన్నతల్లితో సమానంగా మధుసూదన్ రావు చూసుకునేవారు.. అందుకే ఆమె పేరిట అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఈ సంస్థకి అక్కినేని నాగేశ్వరరావు చైర్మన్గా పనిచేయడమే కాదు పార్టనర్ షిప్ కూడా పొందారు.. ఆ తర్వాత కాలంలో క్రమంగా అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థను సొంతం చేసుకున్నారు.

దుక్కపాటి మధుసూదన్ రావు విశేషాలు..

పెయ్యేరు వాసి అయిన మధుసూదన్ రావు మచిలీపట్నంలోని నోబుల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు..అదే సమయంలో ఎక్సెల్షియర్ అనే డ్రామా కంపెనీ ప్రారంభించగా.. అందులో ఆత్రేయ, అక్కినేని, బుద్ధరాజు సభ్యులుగా వ్యవహరించేవారు. ఆ సమయంలోనే ఆ నిర్మాతకి ఈ హీరోకి మద్యం పరిచయం ఏర్పడింది.. అదే నిర్మాణ సంస్థలో పార్ట్నర్ షిప్ కి దారి తీసింది..ఆ సమయానికి అక్కినేని ఆల్రెడీ వెండితెరపై అడుగు పెట్టారు.. 1941 లో వచ్చిన ధర్మపత్ని అనే ఒక సినిమాలో చిన్న పాత్ర చేసి మళ్లీ తిరిగి వచ్చి నాటకాలు వేసేవారు..

- Advertisement -

స్త్రీ పాత్రలో అక్కినేని..

ఇక నాటకాలలో ఎక్కువగా స్త్రీ పాత్రలు వేయడం ప్రారంభించిన అక్కినేనికి ఎంతోమంది లేడీ అభిమానులు కూడా ఉన్నారనటంలో సందేహం లేదు.. అలా ఒకసారి స్త్రీ పాత్రలో ఉన్న అక్కినేనిని చూసి.. ఒక నిర్మాత వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారట అంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయేవారు అక్కినేని.. ఇక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో వందల చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్నారు. చివరిగా మనం సినిమాలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ మహమ్మారి బారిన పడి తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణాంతరం ఆయన వారసుడు నాగార్జున అలాగే నాగార్జున వారసుల అక్కినేని నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగుతూ అభిమానులకు చేరువలో ఉన్నారు. ఏది ఏమైనా అన్నపూర్ణ ప్రొడక్షన్స్ హౌస్ వెనుక ఇంత కథ ఉందని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు