ANR : అక్కినేని పెళ్లిలో ఇన్ని మలుపులా..?

ANR

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి మూల స్తంభం లాంటి వారు.. ఎన్టీఆర్ కంటే ముందుగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఎన్నో రికార్డులను సృష్టించారు.. తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచిన అక్కినేని నాగేశ్వరరావు.. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం చిరస్మరణీయం.. ఇదిలా ఉండగా అక్కినేని పెళ్లికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలలో ఆయన పెళ్లి కూడా ఒకటి..

అక్కినేని కుటుంబంలో చదువుకున్న వారు ఎవరూ లేరు పైగా ఆయన సోదరులు కూడా చదువుకోలేదు. అప్పటికే పాతిక ఎకరాల భూమిని కలిగి ఉన్న ఆ కుటుంబంలో అక్కినేని చదువుకోడానికి సిద్ధమయ్యారు.. కానీ తమ కుటుంబంలో చదువుకున్న వారు ఎవరూ లేకపోవడంతో ఇక ఈయనను కూడా చదివించడం వృధా అని భావించింది ఆయన తల్లి పున్నమ్మ.. అప్పటికే చిన్న చిన్న నాటకాలు వేస్తూ పేరు దక్కించుకున్న అక్కినేనిని అందులోనే పేరు తెచ్చుకుంటాడేమో అని భావించి నాటకాలను ప్రదర్శించే వ్యక్తికి అక్కినేని అప్పగించారు పున్నమ్మ.. అలా మొదటి నాటకం ద్వారా అర్ధ రూపాయి సంపాదించారు.. ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్ లో ఘంటసాల బలరామయ్య ఈయనను చూసి సినిమాల్లో అవకాశం ఇస్తాను అని చెప్పడంతో మద్రాస్ ప్రయాణానికి రెడీ అవుతున్నప్పుడు.. పున్నమ్మకి ఒక ఆలోచన వచ్చింది.

వెళ్లేది సినిమాలలోకి.. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమో.. తన బిడ్డ చెడు వ్యసనాలకు బానిస అవుతాడేమో అని భయపడి.. పెళ్లి చేసేసి పంపిస్తే ఇంకో అమ్మాయి జోలికి వెళ్లడు అనుకుంది. ఇక అనుకున్నదే తడువుగా చిన్నతనం నుంచే అతని మేనత్త కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మరోవైపు తన అన్నయ్య కూతురే కావడంతో ఈ విషయం అతనికి చెప్పింది పున్నమ్మ.. అప్పటికే అక్కినేని వయసు 19 సంవత్సరాలు కాగా.. ఆ అమ్మాయి వయసు 15 సంవత్సరాలు .. కొడుకు గురించి బాధపడుతున్న తల్లిని చూసి ఆమె అన్నయ్య , అక్కినేని మేనమామ ఒక మాట అన్నారట.. అబ్బాయి తల్లివి అయి ఉండి నువ్వే ఇంత భయపడితే.. సినిమా వాడికి పిల్లనివ్వాల్సిన నేనెంత ఆలోచించాలి అన్నారట.. ఆ సమయంలో అక్కినేని..” అప్పుడే నాకు పెళ్లెంటి.. జీవితంలో నేను ఇంకా స్థిరపడలేదు.. మద్రాస్ వెళ్తున్నాను.. అక్కడ అవకాశాలు వస్తాయో రావో కూడా తెలియదు.. కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్లి వద్దు” అన్నారట.. అంతేకాదు తన గురించి తన మనసులో తన తల్లి ఏమనుకుంటుందో గ్రహించిన అక్కినేని..” నీ మీద ఒట్టు వేసి చెబుతున్నాను..ఎలాంటి చెడ్డ పనులు అక్కడ నేను చేయను..నన్ను నమ్ము అమ్మ” అంటూ తన తల్లికి మాట ఇచ్చారట.

- Advertisement -

అలా 1944లో సీతారామ జననం చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన అక్కినేని.. ఆ తర్వాత మరో ఐదు సినిమాల్లో నటించి.. చివరికి 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు.. అయితే సినిమాల్లోకి వెళ్లాడన్న కారణంతోనే తన మేనమామ అతడికి కూతురు ను ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడకపోవడంతో బయట అమ్మాయిని వివాహం చేసుకున్నారు అక్కినేని. ఇక అలా కేవలం సినిమాల్లో నటించాడు అన్న ఒక కారణంతో తన మేనమామ కూతురిని వదులుకోవాల్సి వచ్చింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు