Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే కన్నుమూత.. షాక్ లో ఫ్యాన్స్..!

Poonam Pandey

సినీ ఇండస్ట్రీలో చాలమంది సెలబ్రిటీలు వయస్సు మీరకుండానే పలు రకాల అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులవుతూ అభిమానులను తీవ్ర దుఃఖంలో ముంచేస్తున్నారు.. ఈ క్రమంలోనే కొత్త ఏడాది ప్రారంభమై రెండు నెలలు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే స్వర్గస్తులైనట్లు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లు వైరల్ అవడంతో అభిమానులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఆశ్చర్యపోతున్నారు.. ఈరోజు ఉదయం పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు ఆ పోస్ట్ ల సారాంశం .. బాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె అంతే స్థాయిలో కాంట్రవర్సీలలో కూడా చిక్కుకుంది..

ఇక ఈరోజు సడన్గా ఆమె మరణించారని తెలిసి బాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్గా మరణించడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న పూనమ్ ఈరోజు ఉదయం మరణించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పూనమ్ పాండే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది.. బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకు టచ్ లో ఉన్న ఈమె గతంలో చాలా రకాల వివాదాస్పద కామెంట్లు చేసి హాట్ టాపిక్ గా మారింది.

ఒకవైపు సినిమాలతో మరొకవైపు కాంట్రవర్సీ లతో భారీ పాపులారిటీ దక్కించుకొని తెలుగు అభిమానులకు కూడా దగ్గరైన పూనమ్ పాండే ఇలా ఒక్కసారిగా గర్భాశయ క్యాన్సర్ తో కన్నుమూయడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.. ఇక ఈ విషయాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే పూనమ్ పాండే మరణించినట్లు పూనమ్ పాండే రియల్ అనే ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేశారు. ప్రస్తుతం పూనమ్ వయసు 32 సంవత్సరాలు.. ఇంత చిన్న వయసులోనే ఆమె మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

- Advertisement -

ఇకపోతే పూనమ్ కెరియర్ విషయానికి వస్తే ప్రముఖ మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత 2013లో నషా అనే హిందీ చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక నటించింది ఒక చిత్రమే అయినా వివాదాల ద్వారా భారీగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా హాట్ ప్రదర్శనలు చేస్తూ అర్ధ నగ్నంగా మ్యాగజైన్ లపై ఫోజులిస్తూ పలు వివాదాలకు కారణమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు అతి చిన్న వయసులోనే మరణించడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు