Venky 76 : ఇప్పటికీ దారిలోకి వచ్చిన వెంకీ… “సైంధవ్” రిజల్ట్ కళ్లు తెరిపించిందా?

Venky 76

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో ఇమేజ్ చక్రంలో ఇరుక్కుపోకుండా ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హీరో వెంకటేష్. రీసెంట్ గా “సైంధవ్” ఇచ్చిన షాక్ తో మళ్ళీ ఈ హీరో ట్రాక్ లోకి వచ్చాడు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తనకు అచ్చొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే ప్రతీ హీరోకు ఒక్కో ప్లస్ పాయింట్ ఉంటుంది. వెంకటేష్ విషయానికి వస్తే ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్ బలం. కాబట్టి వెంకటేష్ తన ఫ్యామిలీ హీరో ఇమేజ్ కు తగ్గ స్టోరీ లను ఎంపిక చేసుకుంటేనే సెట్ అవుతుంది. లేదంటే “సైంధవ్” లాంటి డిజాస్టర్ ను చవిచూడక తప్పదు. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు ఉన్న క్రేజ్ వల్లనే ఆయన నటించిన దృశ్యం, ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సినిమాలు ఊహించని రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. వెంకటేష్ ఇలాంటి కదలని ఎంచుకుంటే సినిమాకు మినిమం గ్యారెంటీ కలెక్షన్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆయన ఆ ట్రాక్ తప్పి ఇతర జానర్ల జోలికి వెళ్తే కష్టమే. అదే విషయాన్ని ఆడియన్స్ “సైంధవ్” రిజల్ట్ తో మరోసారి వెంకీకి క్లియర్ గా అర్థమయ్యేలా చేశారు. సంక్రాంతి కానుకగా ఫిబ్రవరి 13న “సైంధవ్” మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఈ కథలో ఫ్యామిలీ టచ్ ఉన్నప్పటికీ వెంకటేష్ ను గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ అవతార్లో చూపించబోతున్నారు అనే విషయమే జనాల్లోకి ఎక్కువగా వెళ్ళింది. దాని ఫలితంగానే “సైంధవ్” మూవీ పాన్ ఇండియా ఫ్లాఫ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే వెంకటేష్ మరోసారి తనకు బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ జానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని తెలుస్తోంది.

వెంకటేష్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. వెంకటేష్ కు ఇది 76వ సినిమా కాగా, నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గతంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కాంబోలో సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 వంటి హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి మరోసారి ఓ డబుల్ హ్యాట్రిక్, మరో హ్యాట్రిక్ కు వెంకీ, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ శ్రీకారం చుడుతున్నారు.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు