Leader 2 : సీక్వెల్ కు రెడీ అవుతున్న శేఖర్ కమ్ముల… ముగ్గురు హీరోలు

Leader 2

గత కొన్ని రోజులుగా “లీడర్” సీక్వెల్ తెరపైకి రాబోతోందని, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీ స్క్రిప్ట్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం ముగ్గురు హీరోలు లైన్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ ముగ్గురు హీరోలు ఎవరు? అంటే…

2010లో దగ్గుబాటి కాంపౌండ్ నుంచి రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ “లీడర్”. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇందులో రానా అర్జున్ ప్రసాద్ అనే యువ ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. రానా సరసన ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించారు. బాక్స్ ఆఫీస్ వద్ద స్లీపర్ హిట్ గా నిలిచిన ఈ పొలిటికల్ డ్రామా దగ్గుబాటి అభిమానుల ఫేవరెట్ సినిమాలలో ఒకటి. ఈ మూవీ తర్వాత రానా పలు సినిమాలు చేసి, బాహుబలితో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో రానా సినిమాలు బాగా తగ్గించాడు. మరోవైపు ఆయన అభిమానులు మాత్రం చాలా రోజుల నుంచి “లీడర్” సీక్వెల్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కల నిజమయ్యే సమయం ఆసన్నమైనట్టుగా అనిపిస్తోంది. “లీడర్ 2” ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నట్టుగా ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది.

ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. నాగార్జున, ధనుష్ లతో DNS అనే మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ మూవీని ఏషియన్ గ్రూపుకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఈ నిర్మాతలు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” అనే బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించారు. త్వరలోనే తమ కాంబోలో మూడవ మూవీ రాబోతోందని రీసెంట్ గా నిర్మాతలు హింట్ ఇచ్చారు. దీంతో అది తప్పకుండా “లీడర్ 2″నే అనే ప్రచారం మొదలైంది. ఇక ఫిలిం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల “లీడర్ 2” కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సీక్వెల్లో రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పలు మార్పులను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారట. అయితే ఈ మూవీ కోసం రానా తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోల పేర్లను శేఖర్ కమ్ముల పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరన్న విషయం ఇంకా తెలియ రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. “బాహుబలి” తర్వాత పూర్తిగా వెనకబడిపోయిన రానా ఈ సినిమాతో మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు