Telugu New Movie: నాగ్ హీరో – అక్షయ్ విలన్… పాన్ ఇండియా ప్లాన్

Telugu New Movie

అక్కినేని ఇంట్లో చాలా రోజుల నుంచి హిట్స్ లేవు. తాజాగా నా సామి రంగతో అక్కినేని పరువును కాపాడాడు నాగ్. అయితే, నా సామి రంగ తర్వాత నాగార్జున పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నాడని గాసిప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా యాక్షన్ మూవీ SSMB29లో నాగార్జున కీ రోల్ చేస్తున్నాడు అని చాలా రోజుల నుంచి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనిలో ఎంత వరకు వాస్తవం ఉందో ఇంకా తెలిదు.

అయితే, నాగ్ గురించి ఇప్పుడు మరో న్యూస్ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చింది. అదేంటంటే… నా సామి రంగ సినిమా కంటే ముందే… నాగార్జున తమిళ దర్శకుడు నవీన్ నుంచి ఓ స్టోరీ విన్నాడట. అయితే నా సామి రంగ షూటింగ్ ఉంది కాబట్టి… దీని తర్వాత పట్టాలెక్కించాలని అనుకున్నారట. అది ఓ మల్టీ స్టారర్ సినిమా అని తెలుస్తుంది. అందులో నాగార్జున్ హీరో పాత్ర చేస్తే మరో హీరో విలన్ పాత్ర చేయాల్సి ఉంటుందని టాక్.

ఈ విలన్ పాత్రకు బాలీవుడ్ నుంచి ఓ బడా హీరో తీసుకోవాలని డైరెక్టర్ నవీన్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను మూవీ టీం సంప్రదించారని, ప్రస్తుతం స్టోరీ గురించి, పాత్ర గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయని సమాచారం. అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఓ భారీ పాన్ ఇండియా సినిమా రావడం ఖాయమని తెలుస్తుంది.

- Advertisement -

కాగా, ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. హీరోకు విలన్ కు మాధ్య భారీ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అందుకు అనుకూలంగా భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారట. ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ ఈ సినిమాకు సైన్ చేయలేకపోతే… ఓ కోలీవుడ్ హీరో మరో ఆప్షన్ గా ఉన్నట్టు టాక్. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా, నాగార్జున – అక్షయ్ కుమర్ మల్టీస్టారర్ గా చేయడం ఇదే మొదటి సారి కాదు. 1998లో ఈ కాంబోలో ఒక హిందీ మూవీ వచ్చింది. మహేష్ భట్ దర్శకత్వం వహించిన అంగారాయ్ (Angaaray) సినిమాలో వీరు కలిసి నటించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక అయితే, నాగార్జున – అక్షయ్ కుమార్ కాంబోలో రెండో మూవీ వచ్చినట్టే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు