Andrea Jeremiah: ఆ ఆలోచనే లేదు… పెళ్లిపై బోల్డ్ కామెంట్స్

Andrea Jeremiah

సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారి తన అందం, అభినయంతో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న ప్రముఖ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట శరత్ కుమార్ హీరోగా నటించిన పచ్చైక్కిళి మత్తుచ్ఛరం చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా పరిచయమైంది ఆండ్రియా.. ఈ సినిమా సక్సెస్ కావడంతో హీరోయిన్గా ఈమెకు వరుస అవకాశాలు తలుపు తట్టాయి.. అలా కమలహాసన్ సరసన విశ్వరూపం సినిమాలో నటించే అవకాశాన్ని దర్శించుకుంది.. రెండవ చిత్రంతోనే లోకనాయకుడితో అవకాశం రావడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు లభించాయని చెప్పాలి..

కార్తీతో ఆయిరత్తిల్ ఒరువన్ సినిమాలో నటించింది ఇక ఆ తర్వాత తరమణి, వడ చెన్నై వంటి చిత్రాలలో ఛాలెంజింగ్ పాత్రలు చేసి గట్స్ ఉన్న నటిగా నిరూపించుకుంది. కేవలం సింగర్ గా, హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ .. ఇక తుప్పరివాలన్ అనే చిత్రంలో విలనిజాన్ని ప్రదర్శించి ఆల్రౌండర్ అనిపించుకుంది. ఇకపోతే నటిగా , గాయనిగా రాణిస్తున్న ఈమె చేతిలో ప్రస్తుతం నో ఎంట్రీ, పిశాచి 2, మాళిగై వంటి చిత్రాలు ఉన్నాయి ఇకపోతే పిశాచి 2 చిత్రంలో ఈమె ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఆ సన్నివేశాన్ని తొలగించినట్లు కూడా తెరపైకి వార్తలు రావడం గమనార్హం.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.. ఎప్పుడో విడుదల కావాల్సినా ఇప్పటికే ఈ సినిమా ఇంకా తెరపైకి రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది.. ఇదిలా ఉండగా ఇన్ని సంవత్సరాల వయసు వస్తున్నా ఆండ్రియా మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది..ఇదే విషయం ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ భేటీలో ప్రస్తావనకు రాగా.. ఆండ్రియా ఇలా బదులిచ్చింది.. ఒక వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రతి అమ్మాయికి వస్తుంది.. అలాంటి ఆలోచన నాకు 30 ఏళ్ల వయసులో వచ్చింది.. అయితే అప్పుడు కొన్ని కారణాలవల్ల వివాహం చేసుకోలేదు. ఇప్పుడు చేసుకుందాం అన్నా కూడా వయసు దాటిపోయింది.. అయినా ఇలా ఒంటరిగా ఉండడం వల్ల నాకు ఎటువంటి బాధ లేదు.. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అసలే లేదు అంటూ స్పష్టం చేసింది ఆండ్రియా.

- Advertisement -

ఇకపోతే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు 50 సంవత్సరాలు వయసు దాటిపోయినా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ఆండ్రియా కూడా చేరిపోయిందనటంలో సందేహం లేదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు