Vishwambhara : “విశ్వంభర” రిలీజ్ డేట్ ప్లాన్ అదుర్స్… 10 రోజులు వరుస హాలిడేస్

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యువి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు టైటిల్ గ్లింప్స్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, మరింత క్యూరియాసిటీని పెంచేసింది. మెగా అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న “విశ్వంభర” రిలీజ్ డేట్ ను కూడా ఇప్పుడే ప్రకటించేశారు మేకర్స్. 2025 సంక్రాంతి బరిలో మెగాస్టార్ మూవీ ఉంటుందన్న విషయాన్ని ముందుగానే చెప్పేశారు. వచ్చే ఏడాది జనవరి 10న “విశ్వంభర” మూవీ విడుదల కాబోతుంది అని తాజాగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ రిలీజ్ డేట్ ప్లాన్ అదుర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే “విశ్వంభర”కు పండగ మాత్రమే కాదు పది రోజుల హాలిడేస్ కూడా కలిసి రాబోతున్నాయి.

స్టార్ హీరోల సినిమాలకు అనుకూలమైన సీజన్ లలో సంక్రాంతి ఒకటి. కంటెంట్ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ పండగ మూడ్ లో ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ హిట్ ఇచ్చేస్తారు. కలెక్షన్లు కూడా భారీగానే ఉంటాయి. అందుకే చాలామంది సినిమా నిర్మాతలు సంక్రాంతికి తమ మూవీని రిలీజ్ చేయాలని భావిస్తారు. తాజాగా “విశ్వంభర” మేకర్స్ కూడా అదే ప్లాన్ లో ఉన్నారు. అయితే వీళ్ళ ముందుచూపుకి హాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే “విశ్వంభర”కు మూడు రోజుల సంక్రాంతి పండుగతో పాటు మొత్తం పది రోజుల హాలిడేస్ కలిసి వచ్చే విధంగా రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. “విశ్వంభర” 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. స్కూల్స్, కాలేజీలకు జనవరి 9 లేదా 10 నుంచి 19 వరకు హాలిడేస్ ఉంటాయి. ఈ గ్యాప్ నే “విశ్వంభర” టీం ఉపయోగించుకుంటుంది.

జనవరి 10న “విశ్వంభర” ఓపెనింగ్ డే. ఆ తర్వాత రెండు రోజులు వీకెండ్ ఉంటుంది. నెక్స్ట్ మూడు రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండగ రోజులు. ఆ తర్వాత రోజు అంటే మూవీ రిలీజ్ అయిన 7 రోజు ముక్కనుమ, 8వ రోజు శుక్రవారంతో మళ్ళీ వీకెండ్ వచ్చేస్తుంది. అలా మొత్తానికి 10 రోజుల కంటిన్యూ హాలిడేస్ ను “విశ్వంభర” క్యాష్ చేసుకోబోతోంది అన్నమాట. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలలో విడుదల తేదీని ప్రకటించిన ఫస్ట్ మూవీ ఇదే. మరోవైపు తాజాగా మెగాస్టార్ చిరంజీవి “విశ్వంభర” సెట్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. చివరగా “భోళా శంకర్” మూవీతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి “విశ్వంభర”తో ఎలాగైనా సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు