Madraskaaran: హీరోయిన్ గా రీఎంట్రీకి సిద్ధమైన మెగా డాటర్.. హీరో ఎవరంటే..?

Madraskaaran

మెగా డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల నటిగా ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్ గా ఆమె ఒక చిత్రానికి ఎంపికయ్యారు.. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వచ్చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయినా ఒకే ఒక అమ్మాయి నిహారిక కొణిదెల.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులా లాగే ఈమె కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెడతానన్నప్పుడు అభిమానుల నుంచి అలాగే కుటుంబ సభ్యుల నుంచి అనేక వ్యతిరేకతలను ఎదుర్కొంది..

అయినప్పటికీ కూడా అవేవీ పట్టించుకోకుండా హీరోయిన్గా మారి పంతం నెగ్గించుకుంది..కానీ హీరోయిన్గా సక్సెస్ పొందలేకపోయింది. నాగశౌర్య హీరోగా ఒక మనసు సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ , సూర్యకాంతం వంటి చిత్రాలలో నటించింది. కానీ ఏ సినిమా కూడా నిహారిక కి బ్రేక్ ఇవ్వలేక పోయింది.. ఇక దాంతో చేసేదేమి లేక.. గుంటూరు కి చెందిన చైతన్య జొన్నలగడ్డను 2020లో పెద్దలు కుదిర్చిన వివాహాన్ని చేసుకుంది. పెళ్లి తర్వాత రెండు సంవత్సరాలు వీరి కాపురం సవ్యగానే సాగింది కానీ కారణం తెలియదు.. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు..దాంతో చివరికి విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది ఈ జంట.

ఇటీవల నిహారిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పరోక్షంగా విడాకులకు కారణం చైతన్య అంటూ వెల్లడించింది. దీనిపై చైతన్య కూడా మండిపడ్డారు ఇరువురి వాదనలు విన్న తర్వాతే తప్పు ఎవరిదో తెలుసుకోవాలని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇకపోతే విడాకుల తర్వాత తన కెరీర్ ని పూర్తిగా సినిమాలపైనే పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అలా నిర్మాతగా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది.. అలాగే ఇప్పుడు నటిగా కొనసాగాలనుకుంటుంది. అందులో భాగంగానే డెడ్ పిక్సెల్స్ అనే టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసిన ఈమె తాజాగా హీరోయిన్గా ఒక సినిమాను ప్రకటించింది.

- Advertisement -

చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి సిద్ధమైంది నిహారిక.. మద్రాస్ కారన్ అనే టైటిల్ తో ఒక మలయాళం చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది నిహారిక. ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షేన్ నిగమ్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా నిహారిక కు తమ ప్రాజెక్టులోకి వెల్కమ్ చెబుతూ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం.. మొదటి ఇన్నింగ్స్ లో కెరియర్ ను సక్సెస్ చేసుకోలేక డీలా పడిపోయిన ఈమె కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు