Rajinikanth: అరగంటకే కోట్లు వసూలు చేస్తున్న సూపర్ స్టార్?

Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ దిగ్గజ సీనియర్ హీరో రెమ్యూనరేషన్ కచ్చితంగా భారీగానే ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. కానీ రజినీ కేవలం అరగంటకే కోట్లలో వసూలు చేస్తున్నాడు అన్న విషయం ఎంతమందికి తెలుసు? తాజాగా “లాల్ సలాం”లో నటించినందుకు గాను రజినీకాంత్ తీసుకున్న పారితోషకం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు? అంటే…

రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన “లాల్ సలాం” మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగు వర్షన్ పై పెద్దగా బజ్ లేదు, కానీ తమిళంలో మాత్రం సూపర్ స్టార్ అభిమానులు “లాల్ సలాం” కోసం ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన రజినీకాంత్ కేవలం అరగంట మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ అరగంట కోసమే రజినీ కోట్లలో పారితోషకం తీసుకున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలో ఆయన మొయిద్దిన్ భాయ్ అనే పాత్రను పోషించారు. కేవలం 30 నిమిషాల సన్నివేశాల్లో కనిపించడానికి డేట్స్ కేటాయించిన రజనీకాంత్ ఈ పాత్ర కోసం ఏకంగా 40 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని రూమర్లు నడుస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు గానీ, ఒకవేళ ఇదే నిజమైతే కేవలం అరగంట నిడివి ఉన్న పాత్రలో నటించినందుకు ఏకంగా 40 కోట్ల పారితోషకం తీసుకున్న మొట్టమొదటి నటుడు రజనీకాంతే అవుతారు.

ఇక ఏడుపదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీని ఇచ్చే విధంగా వరుసగా సినిమాలను చేస్తూ రికార్డ్ బ్రేకింగ్ హిట్స్ అందుకుంటున్నారు రజినీకాంత్. రీసెంట్ గా “జైలర్” సినిమాతో రజినీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా భారీ బడ్జెట్ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు రజనీకాంత్. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీ హీరోగా “వెట్టైయన్” అనే మూవీ రూపొందుతోంది. తలైవా కెరీర్లో ఇది 170 వ చిత్రం. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్, సెల్వరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజు వంటి బడా దర్శకులతో వరుసగా సినిమాలు చేయబోతున్నారు రజినీకాంత్. అందులో ముందుగా “లాల్ సలాం” రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు