Anand Ranga : ఒరేయ్ గుండు నాయాల అంటూ “ఓయ్” డైరెక్టర్ పై నెటిజన్ కామెంట్… డైరెక్టర్ నుంచి ఊహించని రియాక్షన్

కల్ట్ లవ్ స్టోరీ “ఓయ్” మూవీ డైరెక్టర్ ఆనంద్ రంగాను తాజాగా ఓ నెటిజన్ గుండు అంటూ సంబోధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ కామెంట్ కు దర్శకుడు స్పందించిన తీరే అంతకంటే ఎక్కువగా చర్చకు దారి తీసింది.

ప్రస్తుతం సౌత్ లో సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ సిద్ధార్థ హీరోగా, షామిలి హీరోయిన్ గా నటించిన లవ్ డ్రామా “ఓయ్” రీ రిలీజ్ కు రెడీ అయింది. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2009లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. “ఏ వాక్ టు రిమెంబర్” అనే అమెరికన్ స్టోరీని బేస్ చేసుకుని రూపొందిన ఈ మూవీలో నెగిటివ్ ఎండింగ్ ఉండడం వల్ల అప్పట్లో పెద్దగా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. కానీ తర్వాత ఈ మూవీకి యూత్ నుంచి మంచి క్రేజ్ లభించింది. ఈ మూవీ రీ రిలీజ్ గురించి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఒక వర్గం ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా నిర్మాత డివివికి, డైరెక్టర్ ఆనంద్ కి “ఓయ్ ” మూవీని రీ రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఇది గమనించిన మేకర్స్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని మరోసారి థియేటర్లలోకి తీసుకువచ్చే ప్లాన్ చేశారు.

“ఓయ్” మూవీ రీ రిలీజ్ కాబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ ఆనంద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ కి ఓ నెటిజన్ “ఒరేయ్ గుండు నాయాల ఇలాంటి మంచి సినిమాలు తీసి ఎటు పోయావ్ రా” అంటూ కామెంట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ చూసిన డైరెక్టర్ స్మైల్ ఎమోజితో రిప్లై ఇచ్చాడు. ఇలా ఊహించని విధంగా దర్శకుడు నుంచి రిప్లై రావడంతో నెటిజన్ కు దిమ్మతిరిగినంత పని అయింది. వెంటనే “గుండు అని పిలిచినందుకు సారీ సార్” అంటూ ఆ నెటిజన్ ప్రశ్చాతాపాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు డైరెక్టర్ ఇచ్చిన రిప్లై ఎపిక్ అని చెప్పాలి. “దట్స్ ఓకే, అదే కదా నిజం” అంటూ కూల్ గా రిప్లై ఇచ్చాడు డైరెక్టర్ ఆనంద్. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎవడు చూస్తాడు లే అని ఎలా పడితే అలా కామెంట్స్ చేస్తే ఇలాగే ఉంటుంది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం అతను చెప్పిన విధానం తప్పయినప్పటికీ ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నారు. ఆ ఇంటెన్షన్ అర్థమైంది కాబట్టి డైరెక్టర్ ఆనంద్ తప్పుగా అర్థం చేసుకోకుండా స్పోర్టివ్ గా తీసుకోవడం మంచి విషయం అని మెచ్చుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు