Poonam Kaur: అలాంటి జబ్బుతో బాధపడుతున్న పూనమ్ కౌర్..!

ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గత రెండు సంవత్సరాలుగా ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా తెలిపింది. 2022లో వెన్ను నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కేరళ వెళ్ళిన ఈమె అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటుండగా.. అక్కడే ఈ వ్యాధి వచ్చినట్లు నిర్ధారణ అయింది.. ఈ విషయాన్ని గతంలో ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 2022 నుంచి చికిత్స కూడా తీసుకుంటుంది. అంతేకాదు కేరళలోని ఒక ఆయుర్వేద ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంది ఈ ముద్దుగుమ్మ.. కానీ ఫలితం లేదన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె నేచురోపతి వైద్యంలో ఎంతో గుర్తింపు పొందిన డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుని కలుసుకున్నట్లు తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది..

మంతెన సత్యనారాయణ రాజుని కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు చెప్పుకొచ్చింది.. అంతేకాదు ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు ఎంతో అమూల్యం.. మంచి మనసు గల వ్యక్తితో ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాధి గురించి చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే ఈ వ్యాధి తో తాను చాలా ఇబ్బంది పడినట్లు తెలిపింది. కనీసం దుస్తులు కూడా వేసుకోలేకపోయానని.. అవి ధరిస్తున్నప్పుడు కూడా నొప్పి వచ్చేదని వాపోయింది .. దీంతో ఎప్పుడు వదులుగా ఉన్న దుస్తులే ధరించాల్సి వచ్చేది అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు నిద్రలేమి సమస్యతో బాధపడతారు. అలసటతో పాటు శరీరం మొత్తం విపరీతమైన నొప్పిని కలిగి ఉంటుంది. మెడ, భుజాలు , ఛాతి , వీపు వద్ద ఎక్కువ నొప్పి ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గడం, డిప్రెషన్ , ఆందోళన ఎక్కువగా కనిపిస్తాయి. వాస్తవానికి ఈ వ్యాధి నయం చేయడానికి ఒకే పరిమాణానికి సరిపోయే మందులు లేవని వైద్యులు చెప్పే మాట.. కానీ జీవనశైలి మార్పులతో దీన్ని కంట్రోల్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపిన సూచనల మేరకు తన వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక పూనమ్ కౌర్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటిగా మారి తమిళ్ , మలయాళం చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె 2005లో మిస్ ఆంధ్ర టైటిల్ ని కూడా గెలుచుకుంది.

- Advertisement -

ఎస్ .వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కీ అండ్ నీరజ్ వంటి చిత్రాలలో నటించింది . తర్వాత కొన్ని చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించింది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా మాట్లాడుతూ..ఇటు రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు