Vijay Political Party : రాజకీయాల్లో దళపతి… పార్టీ పేరును ప్రకటించిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయన అభిమానుల ఉత్కంఠకు ఎట్టకేలకు ఈరోజు తెరపడింది. తాజాగా తన పొలిటికల్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో ఇళయ దళపతిగా కోట్లాదిమంది అభిమానులను అలరించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. తాజాగా తన రాజకీయ పార్టీ పేరుతో సహా దానికి సంబంధించిన పత్రాలను ఆన్లైన్లో షేర్ చేశారు.

చాలా రోజులుగా విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలం నుంచి తన అభిమాన సంఘాలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్న విజయ్ తాజాగా తన పార్టీ పేరును ఫిక్స్ చేశారు. తమిళనాడు సెంటిమెంట్ కలిసి వచ్చేలా “తమిళ వెట్రి కళగం” అని తన రాజకీయ పార్టీకి పేరును ఖరారు చేశాడు. తమిళనాడు సక్సెస్ పార్టీ అని దీని అర్థం. వెట్రి అంటే విజయం, కళగం అంటే పార్టీ అనే అర్థం వస్తుంది.

విజయ్ ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద తన పార్టీ పేరును నమోదు చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన పత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పార్టీ పేరుతో పాటు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలను కూడా ఓపెన్ చేశారు. ఇక విజయ్ “తమిళ వెట్రి కళగం” పేరుతో రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ లేఖలో “విజయ్ పీపుల్స్ మూమెంట్” గత అనేక సంవత్సరాల నుంచి తన శక్తి మేరకు పలు సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు చేస్తున్న సంగతిని విజయ్ గుర్తు చేశారు. అయితే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పూర్తి సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు తీసుకురావడం అసాధ్యమని, దానికి రాజకీయ అధికారం కావాలని అన్నారు. అంతేకాకుండా రాజకీయ మార్పు అనేది ప్రజల ఏకగ్రీవ అభిమానం, ప్రేమ కలగలిసిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, అందుకే టీవీకే “తమిళ వెట్రి కళగం” పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని లేఖలో విజయ్ పేర్కొన్నారు.

- Advertisement -

ఇక లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోమని, అలాగే ఇతని ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని విజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే తమ ఎజెండాను అనౌన్స్ చేస్తామని పేర్కొన్న విజయ్ 2026 లో జరిగే శాసనసభ ఎన్నికలే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాక రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు