Chiranjeevi : చిరుతో రిస్క్ వద్దనుకున్నారా? అందుకేనా వెంకీపై దిల్ రాజు ఇంట్రెస్ట్?

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో రూపొందాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. దిల్ రాజు బడ్జెట్ సమస్యల కారణంగా చిరంజీవితో తెరకెక్కాల్సిన ప్రాజెక్టును క్యాన్సిల్ చేసి, వెంకటేష్ తో ఇదే మూవీని పట్టాలెక్కించబోతున్నట్టు సమాచారం.

కొన్ని రోజుల నుంచి చిరంజీవి హీరోగా ,అనిల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాతగా ఓ ప్రాజెక్ట్ రూపొందబోతోంది అనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో చిరంజీవి దగ్గరికి వెళ్ళగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న “విశ్వంభర” మూవీతో పాటే ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగు కూడా జరపాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక అనిల్ రావిపూడి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. రీసెంట్ గా బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమాతో సీనియర్ హీరోలను కూడా హ్యాండిల్ చేయగల సత్తా తనకు ఉందన్న విషయాన్ని ఈ యంగ్ డైరెక్టర్ నిరూపించుకున్నాడు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండానే బాలకృష్ణను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించాడు. దీంతో చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా అనగానే మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఓటీటీ, శాటిలైట్ రైట్స్ విషయంలో నిర్మాతలకు గతంలో లాగా పెద్దగా లాభాలు రావట్లేదు. దీంతో ఈ కారణం చేతనే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ సమస్యలు ఎదురైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో రెమ్యూనరేషన్ విషయంలో దిల్ రాజు వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ చిరంజీవి ఈ ప్రాజెక్టులో మెయిన్ లీడ్ అయితే ఆయన పారితోషికంతో కలిపి ఈ మూవీ బడ్జెట్ అంచనా ప్రకారమే 170 కోట్లు అవుతుందట. ఇక ఈ మూవీ గనక పట్టాలెక్కితే బడ్జెట్ భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని రిస్క్ గా భావించిన దిల్ రాజు ఈ ప్రాజెక్టులో చిరంజీవిని కాకుండా మరో హీరోను తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే వెంకటేష్ ను సంప్రదించారని తెలుస్తోంది. ఇక వెంకీ, అనిల్ రావిపూడి లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనౌన్స్మెంట్ త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు