Jayalakshmi: పైట జార్చమన్నారు.. మోహన్ బాబు పై నటి సంచలన వ్యాఖ్యలు..!

Jayalakshmi

పలు తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా మారిన నటి జయలక్ష్మి.. ఎక్కువగా తల్లి, వదిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కూతురు అమెరికాలో ఉండడం వల్ల అక్కడికి వెళ్తూ తిరిగి ఇండియాకి వచ్చి నటించడం కష్టంగా మారుతోందని.. అందుకే సినిమా అవకాశాలు చేజారిపోతున్నాయి అంటూ తెలిపింది.. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో వుండే చాలామంది నటీమణులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. ఇక నటి జయలక్ష్మి కి కూడా అలాంటి సమస్యలే ఎదురయ్యాయట..

జయలక్ష్మి ఎవరో కాదు దాసరి నారాయణరావు కుటుంబానికి బాగా దగ్గర బంధువు.. దాసరి భార్య పద్మ రికమండేషన్ తోనే పొలిటికల్ రౌడీ అనే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది..ఈ సినిమాలో ఈమె పాత్ర ఐఏఎస్ అధికారి భార్యగా, క్లబ్ కి ప్రెసిడెంట్ గా నటించడం.. దీంతో ఆమె హుందాగా ఉండే పాత్ర అని సంతోష పడిందట.. కానీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఒక సన్నివేశంలో ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి కొంగు జార్చే సన్నివేశం ఉంది.. సాధారణంగా మహిళలకు అప్పుడప్పుడు పొరపాటున కొంగు జారడం సహజమే.. కానీ ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి ఇలా కొంగు జార్చడం అనేది అసభ్యకరంగా ఉంటుంది.. అందుకే ఇలాంటివి తాను చేయనని చెప్పేసిందట జయలక్ష్మి.. దీంతో కో – డైరెక్టర్లు, మేనేజర్లు రిక్వెస్ట్ చేసినా ఆమె ఒప్పుకోలేదట..

చివరికి ఈ విషయం కాస్త మోహన్ బాబు దగ్గరకు వెళ్ళింది.. సాధారణంగా తన మాటలకు విలువ ఇవ్వని వారిపై మోహన్ బాబు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. అలాంటిది ఆయన ముందే ఈమె అలాంటి మాత్రం చేయడానికి ఒప్పుకోలేదు.. పైగా ఆ అమ్మాయి సమస్య ఏంటి అని మోహన్ బాబు అడిగినా.. ఆమె మాత్రం నిర్మొహమాటంగా అలాంటి పాత్ర చేయను అని చెప్పిందట.. కోపోద్రిక్తుడైన మోహన్ బాబు ఆ తర్వాత ఆమె ఎలా వచ్చిందో తెలుసుకొని తనను ఒక మాట కూడా అనలేదని ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. దాసరి నారాయణరావు సతీమణి పద్మ రికమండేషన్తో వచ్చాను కాబట్టే ఆయన ఒక్క మాట కూడా అనలేదని తెలిపింది జయలక్ష్మి.

- Advertisement -

ఇకపోతే సాధారణంగా సెట్లో ఏదైనా సమస్య వస్తే భయంకరంగా తిడతారు మోహన్ బాబు.. అలాంటిది ఈమెను ఏమీ అనకపోవడానికి కూడా కారణం ఉంది..వాస్తవానికి మోహన్ బాబుకి దాసరి కుటుంబానికి మధ్య మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఆ పాత్ర చేయనని చెప్పినా మారు మాట్లాడకుండా మోహన్ బాబు ఆమెను పంపించినట్లు సమాచారం. అయితే ఈ విషయం విని కొంతమంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరైనా మహిళలు తమకు ఇష్టం లేని పాత్ర చేయను అన్నప్పుడు వదిలేయాలి.. కానీ ఇక్కడ కూడా బంధుత్వమని.. తెలిసిన వాళ్ళు అని.. వివక్షత చూపిస్తారా అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు