Fighter Movie : బేసిక్ సెన్స్ ఉండదు కొందరికి… “ఫైటర్” డైరెక్టర్ పై దారుణంగా ట్రోలింగ్

Fighter Movie

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో రూపొందిన “ఫైటర్” మూవీ ఫ్లాఫ్ అవ్వడానికి ఈ దర్శకుడు చెప్పిన సిల్లీ రీజన్ అందుకు కారణం. సిద్ధార్థ్ మాటలు విన్నాక “ఫైటర్” మూవీ చూడాలంటే ఫ్లైట్ లో ఎగరాలేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్లు. ఇంతకీ ఈ డైరెక్టర్ ఏమన్నాడు? అంటే…

గత ఏడాది పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. షారుక్ హీరోగా నటించిన ఈ మూవీ 1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడంతో సిద్ధార్థ్ దేశంలోని అగ్ర దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు. ఈ మూవీ తర్వాత కొంతమంది ఆయనను స్టీవెన్ స్పీల్ బర్గ్, మైఖేల్ బే ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే అంతలోనే తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందిన “ఫైటర్” మూవీతో ఎదురు దెబ్బ తగిలింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఏవియేషన్ మూవీ “ఫైటర్”. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న థియేటర్లలోకి వచ్చింది.

అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి తీవ్ర నిరాశను మిగిల్చింది. మూవీ మంచి టెక్నికల్ వాల్యూస్ తో ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ నుంచి ఆదరణ కరువైంది. బీసీ సెంటర్ల ఆడియన్స్ ను థియేటర్లలోకి రప్పించలేకపోయిన “ఫైటర్” భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ సిద్ధార్థ్ “ఫైటర్” మూవీ ప్లాఫ్ అవ్వడానికి గల కారణం ఏంటో వెల్లడించారు.

- Advertisement -

సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ “ఫైటర్” మూవీ ఎందుకు జనాలకు ఎక్కలేదు అనే విషయం గురించి వెల్లడించారు. “ఎంతమంది జనాభా మన దేశంలో కాలేజ్ టైంలో ఏవియేషన్ గురించి చదువుకున్నారు? ఎంతమందికి పాస్పోర్ట్ ఉంది? ఎంతమంది ప్లేన్ లో ట్రావెల్ చేశారు? దాదాపు 90% మంది జనాభా మన దేశంలో ఇప్పటిదాకా ఫ్లైట్లో ప్రయాణం చేయలేదు. కనీసం ఎయిర్పోర్ట్ కి కూడా వెళ్లలేదు. ఆ రీజన్ కారణంగానే చాలామందికి “ఫైటర్” సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అంతగా అర్థం కాలేదు. ఆకాశంలో జరిగే ఆ యాక్షన్ సీక్వెన్స్ ను అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు” అంటూ తను రూపొందించిన “ఫైటర్” మూవీ ప్లాప్ అవ్వడానికి రీజన్ ప్రేక్షకులేనంటూ ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

సిద్ధార్థ్ ఇలా తన ఫెయిల్యూర్ ను ఒప్పుకోకుండా ప్రేక్షకులను బ్లేమ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ మూవీ స్పేస్ గురించి ఉంటే అందరూ స్పేస్ టెక్నాలజీ గురించి నేర్చుకోవాలా ఏంటి? సరిగ్గా ప్రమోషన్స్ చేయకుండా ఇలా ఓవరాక్షన్ చేయడం దేనికి? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అతనికి 90 శాతం మంది ప్లేన్ లో వెళ్లలేదు అని ముందే తెలిసినప్పుడు ఏవియేషన్ మీద మూవీ తీయడం ఎందుకు? అంటూ లాజిక్ లాగుతున్నారు. ఇంకొంతమంది అయితే జురాసిక్ పార్క్ సినిమాను చూసే ముందు ఎవ్వరూ డైనోసార్లను చూడలేదని, అయినా ఆ మూవీకి ఎందుకు కనెక్ట్ అయ్యారని? ఒకవేళ ఇంటర్ స్టెల్లార్ మూవీ నచ్చలేదంటే బ్లాక్ హోల్ లోకి వెళ్లి రావాలా ఏంటి? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు