Srimanthudu: నారా రోహిత్ చేయాల్సిన కథను మహేష్ బాబు చేశారా.?

Srimanthudu

ఒక్కో దర్శకుడు కి ఒక్కొక్కసారి బ్యాడ్ టైం అనేది నడుస్తుంది. ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు చుట్టూ పది ప్రొడక్షన్స్ హౌసెస్, 10 మంది హీరోలు ఎలా చేరుతారో, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు అలానే దూరమవుతారు. రచయితగా కెరియర్ మొదలుపెట్టి మంచి మంచి సినిమాలతో గుర్తింపు సాధించుకొని, మిర్చి సినిమాతో దర్శకుడుగా మారాడు కొరటాల శివ. బాహుబలి కి ముందు రిలీజ్ అయిన ఈ ప్రభాస్ సినిమా ఊహించని ఘన విజయాన్ని సాధించింది. కొరటాల శివని దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబెట్టింది.

కొరటాల శివ దర్శకుడుగా చేసిన రెండో సినిమా శ్రీమంతుడు. బాహుబలి సినిమా టైంలో రిలీజ్ అని ఈ సినిమా దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్లను సాధించి తెలుగు సినిమాకి ఉన్న సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు ని చూపించిన విధానం, అలానే ఆ సినిమా కోసం తీసుకున్న అంశం, అందర్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశం కూడా ఆ సినిమాతో కొరటాల శివ చెప్పాడు

ఆ సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తరుణంలో శరత్ చంద్ర అనే ఒక రైటర్ ఆ సినిమా కథ నాది అంటూ కేసు వేయటం మొదలుపెట్టాడు. నేను స్వాతి మ్యాగ్జిన్లో రాసిన కథను చూసి కొరటాల శివ కాపీ కొట్టి ఈ సినిమా తీశారు అంటూ ఆరోపణలు చేశాడు. అయితే మళ్లీ ఆ కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. శివ తీసిన కథ ఆ రచయిత కథకు దగ్గరగా ఉందని కోర్టు కూడా తీర్పులు ఇస్తూ వచ్చింది. అయితే కొరటాల శివ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆ రైటర్ శరత్చంద్ర కూడా డిమాండ్ చేశారు. అలానే 15 లక్షలు ఇస్తానంటే రిజెక్ట్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

- Advertisement -

ఇకపోతే శరత్ చంద్ర మరో విషయాన్ని రివిల్ చేశారు. అప్పట్లో నారా రోహిత్ హీరోగా ఆ సినిమాను చేయాలంటూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చేశామన్నట్లు రైటర్ శరత్ చంద్ర చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఒకప్పుడు మంచి సినిమాలు ఎన్నుకుంటూ డిఫరెంట్ జోనర్ లో సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసేవాడు నారా రోహిత్. ప్రస్తుతం నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాను చేస్తున్నాడు. ఏదేమైనా ఈ కేస్ గురించి మేకర్స్ వైపు నుంచి అఫీషియల్ రెస్పాన్స్ వస్తే గాని ఇది ఒక కొలిక్కి రాదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు