Sharwa36 : శర్వా కొత్త సినిమా ఆ హాలీవుడ్ మూవీకి కాపీనా?

Sharwa36 : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన 36వ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శర్వానంద్ ఈ కొత్త మూవీ ఒక బాలీవుడ్ మూవీకి కాపీ అంటూ టాక్ నడుస్తోంది. దీంతో శర్వానంద్ రిస్క్ తీసుకుంటున్నాడనే టెన్షన్ మొదలైంది ఆయన అభిమానుల్లో. మరి ఇంతకీ శర్వానంద్ మూవీ ఏ బాలీవుడ్ మూవీనీ ఇన్స్పిరేషన్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే?

Sharwa36 స్టోరీ ఇదే

లూజర్ వెబ్ సిరీస్ ఫేమ్ అభినాష్ రెడ్డి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన 36వ సినిమాను చేస్తున్న విషయం తెలిసింది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీని Sharwa36 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన 30 రోజుల షూటింగ్ పూర్తయింది. జూన్ నెలాఖరులోగా ఈ మూవీని పూర్తి చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఈ మూవీలో శర్వానంద్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్ లో గతంలోనే వచ్చిన తర రం పం అనే మూవీ లాంటి బ్యాగ్రౌండ్ తో శర్వానంద్ 36 మూవీ తెరకెక్కుతోందని సమాచారం.

ఇందులో శర్వానంద్ హైదరాబాద్ లో సైలెంట్ గా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడని, అయితే గతం ఆయన్ని కష్టపెడుతుందని, భార్య పిల్లలకు కూడా శర్వానంద్ గతం వల్ల కష్టాలు ఎదురవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బైక్ రేసర్ గా శర్వానంద్ గతం బయట పడుతుందని, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ అని టాక్ నడుస్తోంది.

- Advertisement -

ఈ బాలీవుడ్ మూవీకి కాపీనా?

ఇక సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన మూవీ కూడా దాదాపుగా ఇదే పంథాలో సాగుతుంది. ఈ మూవీనే కాకుండా ఇప్పటిదాకా బైక్ రేస్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే వచ్చే సినిమాలన్నీ కూడా దాదాపుగా ఇలాగే ఉంటాయి. నాని చేసిన జెర్సీ కూడా దాదాపుగా ఇదే స్టోరీ. కాకపోతే ఇది క్రికెట్ నేపథ్యంలో వచ్చింది.

శర్వా రిస్క్ చేస్తున్నాడా?

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే బైక్ రేసింగ్ కథలు రొటీన్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ లేదా శాడ్ లవ్ స్టోరీ దాని బ్యాగ్రౌండ్ లో బైక్ రేసింగ్ ఉండడం అనేది సర్వసాధారణం. ఇక అప్పటిదాకా ఏదో కోల్పోయినట్టుగా ఉండే హీరో మళ్ళీ తన పాత జీవితంలోకి అడుగు పెట్టడం లాంటి కథలను ఇప్పటికే చాలా వరకు వాడేసారు. ఇలాంటి సినిమాలకు ఎమోషన్, స్క్రీన్ ప్లే అనేవి ఆయువు పట్టు లాంటివి. అవి వర్కౌట్ అయితేనే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. గ్రిప్పింగ్ స్టోరీ లేకపోతే ప్రేక్షకులు పెదవి విరిచే ప్రమాదం ఉంది. మరి ఇప్పటికే సరైన హిట్ కోసం తంటాలు పడుతున్న శర్వా ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు