Balakrishna’s #NBK109: బాలయ్య సినిమా కోసం బాబీ ప్లాన్ అదిరింది..!

అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బాలకృష్ణ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న బాలయ్య, ఈ సినిమా కంప్లీట్ అవ్వకముందే డైరెక్టర్ బాబీతో ఒక సినిమా అనౌన్స్ చేసాడు. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుండగా ఈ సినిమా స్టోరీ గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు పొలిటికల్ టచ్ తో ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో కూడా బాలయ్య యంగ్ అండ్ ఓల్డ్ రోల్స్ లో కనిపిస్తాడట.

ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాలంటే ఔట్ అండ్ ఔట్ మాస్ ఎలిమెంట్స్ తో నిండి ఉంటున్న నేపథ్యంలో బాలయ్య, బాబీ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉంటుందంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో బాలకృష్ణ, వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ బ్లాక్ బస్టర్స్ అందుకున్న క్రమంలో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాతో ఉండబోయే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పొలిటికల్ ఎపిసోడ్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇదే బ్యాక్డ్రాప్ లో వచ్చిన లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ కావటంతో నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై హోప్స్ పెంచుకుంటున్నారు.మరి, ఇప్పటిదాకా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలనే డీల్ చేసిన బాబీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు పొలిటికల్ ఎపిసోడ్ ని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు