Tamannah: జైలర్ లో పాట మాత్రమే! మరి భోళాలో?

Tamannah has no importance in Jailer

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పుడు బ్యాడ్ సిట్యుయేషన్ లో ఉంది. ఈ హీరోయిన్ నటించిన చిత్రాలు వరుస పరాజయాలు అవుతుండగా, హిట్టైన సినిమాల్లో మాత్రం ఇంపార్టెన్స్ ఉండడం లేదు. అందుకని మీడియం, చిన్న హీరోల సినిమాల్లో నటించినా ఆ రోల్స్ పెద్దగా హెల్ప్ అవలేదు. ఇక ఫైనల్ గా గ్లామర్ డోస్ తోనైనా పేరు వస్తుందని లస్ట్ స్టోరీస్ లో నటించగా, అది బెడిసికొట్టి కెరీర్ లో ఎప్పుడూ లేనన్ని ట్రోల్స్ వచ్చి పడ్డాయి.

అందుకే తప్పు తెలుసుకున్న తమన్నా ఇప్పుడు మళ్ళీ సౌత్ బాట పట్టింది. అయితే ఇప్పటికే తెలుగు, తమిళ్ స్టార్స్ అయిన చిరంజీవి, రజినీకాంత్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిందన్న సంగతి తెలిసిందే. కాగా నిన్న జైలర్ సినిమా రిలీజ్ కాగా అందులో తమన్నా కేవలం పాటలోనే కనిపించింది. ఆమె రోల్ కూడా 10నిమిషాలకి మించి లేదు. ఆ పాత్ర రజినీకి కూడా జోడిగా కాదు. ఏదో పాటకోసమే ఆ రోల్ ని పెట్టినట్టుంది.

ఇక ఇప్పుడు తమన్నా ఆశలన్నీ చిరంజీవి భోళా శంకర్ పైనే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇప్పటికే చిరంజీవి తో రెండు పాటల్లో నటించగా, ఆ జోడి బాగాలేదన్న ట్రోల్స్ వస్తున్నాయి. అదీ గాక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో సాగే కథ కాబట్టి, తమన్నా పాత్రని తగ్గించి కీర్తి సురేష్ పాత్రనే హైలెట్ చేసారని టాక్. మరి తమన్నాకి ఇందులో ఏ ఇంపార్టెన్స్ లేదా అంటే, అది సినిమా రిలీజ్ అయ్యాకే చెప్పగలం. ఎందుకంటే ఈ ఒరిజినల్ కథకి భోళా కి చాలా మార్పులు చేసాం, అని మెహర్ రమేష్ చెప్పాడు. అందువల్ల ఈ సినిమాలో తమన్నా రోల్ కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటుందేమో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు