Chandra Babu Lawyer: సిద్ధార్థ్ లూథ్రా పాత్రలో ప్రకాశ్ రాజ్… టాలీవుడ్‌లో బిగ్ ప్లాన్?

Chandra Babu Lawyer

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఎక్కడ చూసిన ఇదే న్యూస్ వినిపిస్తుంది. దీనిలో చంద్రబాబుది తప్పుందా? లేదా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిది తప్పుందా? అనేది పక్కన పెడిదే… ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎవరి గురించి అనుకుంటున్నారా..? ఈ కేసులో చంద్రబాబు కోసం వాధిస్తున్న ప్రముఖ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా. ఈయన ఇండియాలోనే హైయేస్ట్ పెయిడ్ అండ్ హై డిమాండ్ ఉన్న లాయర్.

లూథ్రా ఒక్కసారి కోర్టుకు హాజరవాలంటే మినిమం కోటి వరకు వసూలు చేస్తారట. చంద్రబాబు కేసుకు అయితే, ఒక్క రోజుకే 1.5 కోట్లు, స్పెషల్ ఫ్లైట్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు తీసుకున్నాడట.

అయితే ఇదంతా తెలిసిన సమాచారమే కదా… ఇప్పుడు ఈయన గురించి ప్రత్యేకమైన చర్చ ఎందుకు అంటారా? అయితే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం వ్యవహారంపై సినిమా చేయాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి డిమాండ్ వస్తుంది. ఒక వేళ దీనిపై సినిమా వస్తే కీ రోల్ సిద్ధార్థ్ లూథ్రాదే కదా. అలాంటి రోల్‌లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అయితే సెట్ అవుతాడని అంటున్నారు. అంతే కాదు, ప్రకాశ్ రాజ్ ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాలో అచ్చం అలాంటి క్యారెక్టర్ నే పోషించాడు.

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్‌లో నందగోపాల్ అనే లాయర్ పాత్ర కూడా ఇండియాలోనే హైయేస్ట్ పెయిడ్ అండ్ హై డిమాండ్ ఉన్న లాయర్. ప్రత్యేకంగా ఆ కేసు కోసమే హైదరాబాద్‌కి వస్తాడు. ఇప్పుడు లూథ్రా కూడా స్కిల్ స్కాం కేసు కోసమే ఆంధ్ర ప్రదేశ్‌కి వచ్చాడు కదా.. అలా నంద గోపాల్ పాత్ర, సిద్ధార్థ్ లూథ్రా సింక్ అవ్వడంతో తెరపైకి ఈ డిమాండ్ వచ్చింది. లూథ్రా పాత్రను ప్రకాశ్ రాజ్ చేస్తే ఆ సినిమాకే హైలైట్ అవుతుంది అంటున్నారు నెటిజన్లు.
మరి నెటిజన్ల కోరిక మేరకు సినిమా వస్తుందా….?

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు