Bigg Boss Season7: టంగ్ స్లిప్ అయిన గౌతమ్ – నాగార్జునతో కోటింగ్ గ్యారంటీ..!

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్7 మునుపటి సీజన్స్ కంటే ఇంట్రస్టింగ్ గా సాగుతోంది. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ యాక్టివ్ గా ఉండటంతో పాటు గేమ్ లో చాలా చేంజెస్ చేయటంతో షో ఫస్ట్ వీక్ నుండే ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో గ్లామర్ తో పాటు  ఎంటర్టైన్మెంట్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి.

ప్రతి సీజన్లో లాగే ఈ సీజన్లో కూడా కంటెస్టెంట్స్ మధ్య లవ్ ట్రాక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇదిలా ఉండగా, ఈ సీజన్లో కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ గా మారాలంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో తప్పకుండా విన్ అవ్వాలన్న రూల్ ఉంది. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ లో పవర్ అస్త్ర విన్న అయ్యి  హౌస్ మేట్ గా ఆట సందీప్ కన్ఫార్మ్ అవ్వగా సెకండ్ హౌస్ మేట్ కోసం ఈ వారం టాస్క్ జరిగింది.

సెకండ్ పవర్ అస్త్ర కోసం జరిగే టాస్క్ లో ఎవరు పోటీ పడాలో డిసైడ్ చేయమని కంటెస్టెంట్స్ కి చెప్పాడు బిగ్ బాస్. ఇది కంటెస్టెంట్స్ మధ్య గొడవకి దారి తీసింది. హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం శివాజీ, షకీలా ఎంపిక కాగా, ఈ ప్రాసెస్ లో ప్రిన్స్ యావర్ కి, గౌతమ్ కి గొడవ స్టార్ట్ అయ్యింది. ప్రిన్స్ యావర్ పవర్ అస్త్ర టాస్క్ కి ఎలిజిబుల్ కాదని గౌతమ్ తన ఒపీనియన్ చెప్పాడు.

- Advertisement -

పవర్ అస్త్ర టాస్క్ లో కాంటెస్ట్ చేయటానికి తాను ఏ రకంగా ఎలిజిబుల్ కాదో చెప్పాలంటూ యావర్ గౌతమ్ ని ప్రశ్నించిన నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంజెక్షన్ చేసుకొని బాడీ పెంచావంటూ యావర్ గురించి టంగ్ స్లిప్ అయ్యాడు గౌతమ్. దీంతో హర్ట్ అయిన యావర్ బయటికి వెళ్ళిపోతా అంటూ గోల చేసాడు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి సర్ది చెప్పాక కూల్ అయ్యాడు యావర్. గౌతమ్ యావర్ ని అలా అనటం కరెక్ట్ కాదని, ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున నుండి గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఉంటుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు