Prabhas’s Salaar: ప్రభాస్ ఇంకా సింగిల్‌గా ఉండటానికి కారణం ఆ స్టార్ హీరోయిన్?

Prabhas’s Salaar

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరుకి ఉన్న క్రేజ్ గురించి ఒక్క ముక్కలో చెప్పలేం. డార్లింగ్ తన అభిమానులకు కావాల్సింది ప్రతిది ఇస్తుంటాడు. కానీ, పెళ్లి విషయంలో మాత్రం ప్రభాస్ ఎప్పుడు వెనకడుగు వేస్తునే ఉన్నాడు. కృష్ణం రాజు బతికి ఉన్నప్పుడే ప్రభాస్ పెళ్లి జరిగేది. కానీ, పెళ్లి వద్దు అని మొండికేయడంతో పెద్దాయన కూడా ప్రభాస్ పెళ్లి విషయంపై మౌనంగా ఉన్నారు.

అయితే ప్రభాస్ పెళ్లికి ఇంత వ్యతిరేకత ఎందుకు అనేది డార్లింగ్ అభిమానుల్లో పెద్ద ప్రశ్న. కొన్ని రోజుల క్రితం అనుష్క శెట్టితో, కాజల్ అగర్వాల్‌తో ప్రేమాయణం సాగించడాని తెగ వార్తలు వచ్చేవి. కానీ, వీటిని అనుష్క, కాజల్‌తో పాటు ప్రభాస్ కూడా ఖండించారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తో కూడా డార్లింగ్ లవ్ ట్రాక్ సాగిస్తున్నాడని బీ టౌన్ కోడై కూసింది. దీనిపై ఈ జంట ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా ఈ రూమర్స్ తగ్గడం లేదు. ఇదంత పక్కన పెడితే, ప్రభాస్ కు పెళ్లి విరక్తి రావడానికి కారణం స్టార్ హీరోయిన్ త్రిష మోసం అని తెలుస్తుంది.

ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో త్రిషతో కలిసి వర్షం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీరి మధ్య ప్రేమ కూడా ఆ సినిమాతోనే పుట్టిందట. దీంతో ఈ జంట కలిసి వరుసగా బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలు చేశారు. అంత సాఫిగా నడుస్తున్న సమయంలో త్రిష కోలీవుడ్ పై కన్నెసిందట. అక్కడ అవకాశాల కోసం విజయ్ తలపతితో రహస్యంగా ప్రేమాయాణాన్ని సాగించిందట. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్న ప్రభాస్ ఈ విషయాన్ని తట్టుకోలేడట. దీంతో త్రిషకు బ్రేకప్ చెప్పేసి, ఇక పెళ్లి చేసుకోవద్దని ఫిక్స్ అయ్యాడట.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు