Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ వారం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ఎవరంటే ?

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా రెండు వారాలు ముగించుకొని ముగించుకొని ఈరోజుతో మూడో వారం లోకి అడుగుపెట్టబోతుంది. 14 మంది కంటెస్టెంట్స్ మొదలైన ఈ షో లో గడిచిన వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది. అయితే నిజానికి కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ ను ఆడియన్స్ చాలా మంది ముందుగానే గెస్ చేయడం వల్ల మొదటి వారం ఎలిమినేషన్ తో హౌస్ లో పెద్దగా తేడా కనిపించలేదు.

అయితే ఈ వారం మాత్రం ఎవరు ఉహించనటువంటి ఒక షాకింగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిందని సమాచారం అందుతోంది. ఫిల్మీ ఫై కు అందిన ఎక్స్ క్లూజివ్ గా సమాచారం ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మరెవరో కాదు షకీలా.

నిజానికి షకీలా బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేస్తున్న తీరును బట్టి చూస్తే ఆమె చాలా రోజులు ఉండాల్సిన కంటెస్టెంట్ అని చెప్పవచ్చు కానీ గత రెండు రోజులుగా హౌస్ లో మారిన పరిస్థితుల దృష్ట్యా షకీలా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. వోటింగ్ పరంగా చూస్తే షకీలా కంటే ప్రిన్స్ యావర్ కు తక్కువ ఓట్లు వచ్చాయి.

- Advertisement -

కానీ వారాంతంలో సడన్ గా ప్రిన్స్ యావర్ కు అతను ఆడిన గేమ్ దృష్ట్యా సింపతీ పెరగటంతో షకీలా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా షకీలా హౌస్ నుంచి వెళ్లడం హౌస్ కు ఒకింత లోటు అనే చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో షకీలా ఒక్కరే హౌస్ మేట్స్ లో వచ్చే పరస్పర మనస్పర్థలను అర్థం చేసుకోని సమన్వయం కలిగిస్తున్నారు. అలాంటి కంటెస్టెంట్ రెండు వారాలకే వెళ్లిపోవడం ఆమె ఆటను అభిమానించే వాళ్లకు బాధను కలిగిస్తుందనే చెప్పాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు