Anu Emmanuel: ప్లాప్స్ వస్తున్నా దీనికేం తక్కువ లేదు.. ఇలా అయితే కష్టమే అను

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒకరికీ సక్సెస్ వస్తుందని చెప్పలేం. అయితే ఫెయిల్యూర్స్ వచ్చిన వాళ్లు సక్సెస్ కాలేదని కూడా చెప్పలేం. అయితే ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కాస్త ఆలోచిస్తూ ఉండాలి. అప్పటి పరిస్తితులకు అనుగూణంగా ఉండాలి. కానీ, అను ఇమ్మాన్యుయేల్ మాత్రం అలా కాదు... ఫెయిల్యూర్స్ వచ్చిన కూడా తగ్గేదే లే అంటుంది. ఇటీవల జపాన్ సినిమాతో తన కెరీర్ లో మరో డిజాస్టార్ వేసుకున్న అను ఇమ్మాన్యుయేల్ కి ప్రస్తుతం అవకాశాలు రావడమే కష్టం.

కానీ, బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టార్స్ తర్వత వచ్చే బంగారం లాంటి అవకాశాలను తాను వదులకునేలా చేస్తూందట. అసలు విషయం ఏంటంటే.. అను ఇమ్మాన్యుయేల్ కి ఇప్పటి వరకు చెప్పుకొదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ హీరోలతో సినిమాలు చేసినా, ఈ బ్యూటీ తలరాత వల్లే ఏమో… ఏ ఒక్కటి కూడా ఈమె కెరీర్ కి కలిసి రాలేదు. ఇటీవల ఎన్నో అంచనాలు పెట్టుకున్న జపాన్ చిత్రం కూడా డిజాస్టార్ ఫలితాన్ని ఇచ్చింది.

ఇలాంటి దారుణమైన రికార్డ్ పెట్టుకున్న తర్వాత కూడా సినిమా ఆఫర్స్ వస్తే… చేయాలి కదా… అలా కాకుండా.. భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. ప్రతి సినిమాకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందేనని, అందులోనూ అడ్వాన్స్ గా కోటి రూపాయలు ముందే ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. దీంతో గడప వరకు వచ్చిన అవకాశాలు ఆమె డిమాండ్ చూసి వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలుస్తుంది. ఇలా ఉంటే… అను ఇమ్మన్యుయేల్ కి అవకాశాలు వస్తాయా? మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందా అని ఇండస్ట్రీలో టాక్ వస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు