Anu Emmanuel: చేతిలో సినిమాల్లేవు.. అందుకే షాపింగ్ మాల్ లు తిరుగుతూ ఉంది?

Anu Emmanuel:

టాలీవుడ్ లో “మజ్ను” ప్రేయసి గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా యూత్ క్రష్ లిస్ట్ లో పాతుకుపోయిన హీరోయిన్ “అను ఇమాన్యుయెల్”. యూఎస్ నుండి వచ్చిన ఈ భామ మలయాళం ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి. అయితే ఆఫర్లు అందుకుంది మాత్రం తెలుగులోనే. కెరీర్ మొదట్లో మంచి హిట్లతో పాటు పెద్ద సినిమాల్లోనూ హీరోయిన్ గా ఛాన్సులు కొట్టేసే బిజీ అయింది.

అయితే టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ షో లు చేసినా హిట్ వస్తేనే నిలబడగలదు. మేకర్స్ కూడా మళ్ళీ ఛాన్సులు ఇస్తారు. లేదంటే ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ వేసి పక్కన పెట్టేస్తారు. ప్రస్తుతం అను పరిస్థితి కూడా ఇలాగే ఉంది. లాస్ట్ ఇయర్ “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమాలో అను ఎమాన్యూయెల్ ఎంత గ్లామర్ షో చేసిందో అందరికి తెలిసిందే. ఇక ఈ ఇయర్ రావణాసురలో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా కనిపించడంతో పెద్దగా గుర్తింపే రాలేదు.

ఆ సినిమా తర్వాత సోషల్ మీడియా లో కూడా పెద్దగా యాక్టీవ్ గా లేదు అను. కానీ షాపింగ్ మాల్ ల చుట్టూ బాగా తిరుగుతూ సైడ్ బిజినెస్ చేస్తుంది. రీసెంట్ గా వరంగల్ లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేయగా, తాజాగా నిన్న వికారాబాద్ లో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసింది. సినిమా ఆఫర్లు లేనప్పుడు ఇంతకు మించి ఏం చేస్తుందంటూ మేమర్స్ కూడా సోషల్ మీడియా లో అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు