Tollywood: ఆ పని కోసం శ్రీ లీలకు 2 కోట్లు ఇచ్చిన హీరో ?

Tollywood:

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉంటారు. అలా అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల. హీరోయిన్ శ్రీ లీల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల… ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీ లీల. శ్రీ లీల ది తెలుగు రాష్ట్రమే అయినప్పటికీ కర్ణాటకలో పుట్టి పెరిగింది. అయితే తాజాగా హీరోయిన్ శ్రీల కోసం ఓ స్టార్ హీరో ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీరోయిన్ శ్రీ లీలతో నటించాలని ఆ స్టార్ హీరో ఈ పని చేశాడట. తనకు ఇచ్చే రెమ్యూనరేషన్ లో… రెండు కోట్ల రూపాయలు శ్రీలీలకు ఎక్కువగా ఇవ్వండి అని కోరాడట. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ నా రెమ్యూనరేషన్ నుంచి ఇచ్చేయండి అంటూ… శ్రీ లీలను ఎంకరేజ్ చేశాడట. కానీ తన సినిమాలో కచ్చితంగా శ్రీ లీల హీరోయిన్గా నటించాలని డిమాండ్ పెట్టాడట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు