Anu Emmanuel : ఏ యంగ్ హీరోయిన్ కి ఇలాంటి రికార్డ్ లేదు !

నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. విరించి వర్మ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి గాను అను ఇమ్మాన్యుయేల్ కి బెస్ట్ డెబ్యూ ఫీమేల్ డెబ్యూ అవార్డ్ కూడా వచ్చింది.

మజ్ను సినిమా సక్సెస్ తో అను ఇమ్మాన్యుయేల్ కి వరుస తెలుగు సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమా తరువాత ఆమె రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలో నటించింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తోన్న పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వర్ రావు సినిమాని డైరెక్ట్ చేస్తున్న వంశి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత అను ఇమ్మాన్యుయేల్ విశాల్ హీరోగా వచ్చిన తుప్పరివాలం(డిటెక్టివ్) సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పర్లేదనిపించిన కమర్షియల్ మాత్రం నీరాశపరించింది. అయితే ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ అని చెప్పడం కన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పడం సబబుగా ఉంటుంది. ఈ సినిమా తరువాత గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజెన్, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లే అయ్యాయి. అన్ని సినిమాలు డిజాస్టర్లు అవుతూ వస్తున్న కూడా అను ఇమ్మాన్యుయేల్ కి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ఆ తరువాత ఈమె అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించింది. మంచి అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత నాగ చైతన్యతో చేసిన శైలజ రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఉర్వశివో రాక్షసివో.. సినిమాలు పోటీపడి మరి ఒకదాన్ని మించి ఇంకోటి ప్లాప్ అయ్యాయి. ఎంత ఎక్స్ ప్లోసింగ్ చేసిన, రొమాంటిక్ సీన్స్ కి ఓకె చెప్పిన కూడా అను ఇమ్మాన్యుయేల్ కి సక్సెస్ మాత్రం రాలేదు. రీసెంట్ గా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ ఖాతాలో మరో ప్లాప్ ని నమోదు చేసింది. ఇలా నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ అవడం అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రమే దక్కిన అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు. మరి అను ఇమ్మాన్యుయేల్ ఫ్యూచర్ సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందో, లేక మార్పు ఏమైన వస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు