Samuthirakani: ఫన్&ఎమోషనల్ సమపాళ్లలో హృద్యంగా ఆకట్టుకున్న విమానం టీజర్

విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ “విమానం”. కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కు చరణ్అర్జున్ మ్యూజిక్ అందించారు. ద్విభాషా చిత్రం గా తెరకెక్కిన విమానం చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. మే13 న వరుణ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది.

ఈ టీజర్ లో విమానం ఎక్కాలన్న కలతో సముద్రఖని కొడుకు ఉన్నట్టు చూపిస్తారు. ఆ కలని తండ్రి నెరవేర్చడా లేదా అన్న నేపథ్యంతో ఈ సినిమా నడుస్తుంది అని టీజర్ చూడగానే తెలిసిపోయింది. ఇక ఇందులో సముద్రఖని కుంటివాడిగా మరో విలక్షణమైన నటనకు స్కోప్ ఉన్న పాత్రను చేసారు. టీజర్ చివర్లో “అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు నాన్న అంటారు” అని చెప్పే డైలాగ్ మనసుని కదిలిస్తుంది. ఇక సముద్రఖని కొడుకు పాత్రలో మాస్టర్ ధృవన్ ఆకట్టుకున్నాడు. సినిమాలో కామెడీ కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ నటించింది.

విమానం టీజర్ కి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్స్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ఈ సినిమాకు మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్ గా చేసారు. ఇక విమానం సినిమాలో అనసూయ, ధనరాజ్, రాహుల్ రామకృష, రాజేంద్రన్ ఇతర పాత్రల్లో నటించారు. విమానం చిత్రాన్ని తెలుగు తమిళ, భాషల్లో జూన్9 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు