Dead Pixels :నిహారిక మెడలో తాయత్తు వెనుక రహస్యం అదేనా..?

నిహారిక కొణిదెల.. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మారుమోగుపోతున్న పేర్లలో ఇది ఒకటి. “ఒక మనసు”తో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకి సినిమాల కంటే వెబ్ సిరీస్ లు బాగా కలిసి వచ్చాయి. ఇక తరచూ ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతూ వార్తల్లో నిలుస్తుంది నిహారిక. ముఖ్యంగా ఈమె విడాకులు తీసుకోబోతుందంటూ ఎక్కువగా పర్సనల్ విషయాల వల్ల హైలెట్ అవుతోంది.

అయితే ఇవి కేవలం పుకార్లు మాత్రమేనా..? లేదా నిజమేనా అన్న విషయాలను ఎక్కడా నిహారిక కన్ఫర్మ్ చేయట్లేదు. వీటి గురించి సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ నిహారిక మాత్రం ఎక్కడ అలాంటి విషయాల గురించి ఆలోచించకుండ తన లైఫ్ ని ముందుకు తీసుకు వెళుతుంది. ఈమె వెబ్ సిరీస్ లలో నటించడమే కాదు వాటికి నిర్మాతగాను వ్యవహరిస్తోంది. ఆమె సొంత బ్యానర్ “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” లో ఇటీవల “డెడ్ పిక్సెల్స్” అనే వెబ్ సిరీస్ లో నటించిన నిహారిక.. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుని తెరపైకి తీసుకురాబోతుంది. ఇందుకు సంబంధించి మదర్స్ డే సందర్భంగా పూజా కార్యక్రమాలను మొదలుపెట్టింది.

మదర్స్ డే కానుకగా వాళ్ళ అమ్మ గారితో ఈ పూజా కార్యక్రమాలను చేయించింది. అయితే ఈ పూజా కార్యక్రమంలో నిహారిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. వైట్ శారీతో రెడ్ డాట్స్ తో.. రెడ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో సూపర్ హాట్ గా కనిపించింది. అంతేకాదు ఆక్సిడైజ్ జువెలరీ వేసి, మెడలో తాయత్తులా ఉండే దండతో కనిపించింది. దీంతో నిహారిక మెడలో ధరించిన ఆ తాయత్తు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిహారిక ఇలాంటివి కూడా నమ్ముతుందా..? అంటూ నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం నిహారిక హిట్ ట్రాక్ పడడానికి పూజలు చేయించుకుని ఆ తాయత్తు ధరించిందని ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు