SSMB28: సెంటిమెంట్ కే త్రివిక్రమ్ ఓటా? లేదా వెనక్కి తగ్గుతాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న SSMB28 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తవగా, తదుపరి షెడ్యూల్ జూన్ ఐదు లేదా ఆరు నుంచి మొదలవుతుందని సమాచారం. అయితే ఇటీవల మహేష్ బాబు షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీ తో కలిసి యూరప్ ట్రిప్ కి వెళ్ళాడు. ఆ ట్రిప్ నుండి వచ్చిన వెంటనే మహేష్ బాబు తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. అంతే కాదు ఈ షెడ్యూల్ దాదాపు మూడు నెలల పాటు ఏకధాటిగా జరపనున్నట్టు చిత్ర యూనిట్ నుంచి సమాచారం వచ్చింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లు గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహేష్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ చిత్రానికి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి “గుంటూరు కారం”, టైటిల్ ని అనుకుంటున్నట్టు తెలిసింది. ఇదిగాక త్రివిక్రమ్ స్టైల్ లో మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. “అమరావతికి అటు ఇటు” అని టైటిల్ ని ఈ సినిమాకి పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు “అ” పేరుతో మొదలయ్యేవే ఎక్కువ. అతడు, అత్తారింటికి దారేది, అఆ, అలవైకుంఠపురంబులో ఇలా అన్ని చిత్రాల టైటిల్స్ క్యాచీగా ఉన్నాయి. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి కూడా. ఈ “అ” అక్షరం సెంటిమెంట్ తోనే త్రివిక్రమ్ ఆ టైటిల్ ని పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

అయితే అటు మహేష్ ఫ్యాన్స్ మాత్రం గుంటూరు కారం టైటిల్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల్లో ఈ టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉంది, మహేష్ బాబుకు బాగా సెట్ అవుతుందని అంటున్నారు. మరి త్రివిక్రమ్ తన “అ” సెంటిమెంటును కాదని వేరే టైటిల్ ని పెడతాడా లేదో చూడాలి.

- Advertisement -

ఇక ssmb28 కి సంబంధించిన అఫిషియల్ టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి అయిన మే 31న విడుదలచేయనున్నట్టు సమాచారం. అంతే కాదు ఆ టీజర్ ని కృష్ణ జయంతి నాడు రీ రిలీజ్ అవుతున్న “మోసగాళ్లకు మోసగాడు” సినిమాతో పాటు థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా మహేష్ త్రివిక్రమ్ సినిమా టీజర్& టైటిల్ కృష్ణ జయంతి రోజునే వస్తుందని మహేష్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరి ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పై క్లారిటీ రావాలంటే మే31 వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు