NTR30: జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన శ్రీదేవి కూతురిగా, సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్. తొందర్లోనే శ్రీదేవి లాగే జాన్వీ కూడా తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న ఈమె వరుస తెలుగు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

ధడక్ సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఈ సినిమా విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరాఠిలో సూపర్ హిట్ అయిన సైరాత్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమాలో జాన్వీ పర్ఫామెన్స్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత ఈమె ఘోస్ట్ స్టోరీస్ ఒక అనే ఓటిటి సినిమాలో నటించింది. ధడక్ సినిమా హిట్ తో ఉన్న జాన్వీకి ఈ సినిమా బ్రేక్ వేసింది.

అయితే జాన్వీ ఘోస్ట్ స్టోరీస్ సినిమా తరువాత గుంజన్ సక్సేనా సినిమాలో నటించింది. మాజీ IAF పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయి అందరిచేత ప్రశంశలు అందుకుంది. ఇలా హిట్స్ అండ్ ప్లాప్ తో ఒక మాదిరిగా బాలీవుడ్ లో తన కెరీర్ ని నెట్టుకొస్తున్న జాన్వీకి బాలీవుడ్ లో పెద్ద సినిమాలలో అవకాశాలు మాత్రం రావట్లేదు. దాంతో జాన్వీ చూపు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలవైపు మళ్లింది. అప్పుడే ఈ అమ్మడుకి మొదటి సినిమానే ఎన్టీఆర్ తో చేసే అవకాశం వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో మొదటగా అలియాభట్ అనుకోగా, ఆమె పెళ్లి వల్ల అలియా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చేయలేకపోయింది. దాంతో ఎన్టీఆర్ కి హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డ మూవీ యూనిట్ చివరగా జాన్వీ కపూర్ ని ఒకే చేసారు. అయితే ప్రస్తుతం ఈ షూటింగ్ దశలో ఉండగానే మరో తెలుగు సినిమాకి జాన్వీ ఒకే చెప్పిందట.

- Advertisement -

సమాచారం ప్రకారం అఖిల్ అక్కినేని హీరోగా డెబ్యూ డైరెక్టర్ అనిల్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ధీర ( వర్కింగ్ టైటిల్ ) సినిమాకి హీరోయిన్ గా జాన్వీ తీసుకోబోతున్నరంట. అయితే ఎన్టీఆర్30 సినిమాకి జాన్వీ మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. అలాగే అఖిల్ సినిమాకి కూడా అంతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. అయితే ఇంత డిమాండ్ చేసిన కూడా మేకర్స్ జాన్వీ కి మూడు కోట్లు ఇవ్వడంలో సంకోచించటం లేదంట, అంతేలెండి మరి పక్కింటి పుల్లకూర రుచి అని ఊరికే అనలేదు కదా.మొదటి సినిమాకే మూడు కోట్లు అంటే రానున్న సినిమాలకి ఈ అమ్మాడు ఎంత తీసుకుంటుందో చూడాలి

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు