Dulqer Salmaan: తన తొలిహీరోతో కలిసి చిందేసిన మాళవిక

స్వప్న సినిమా బ్యానర్ లో ప్రియాంక దత్ నిర్మాతగా వైజయంతి మూవీస్ సమర్పణలో తెరకెక్కిన తాజా చిత్రం “అన్ని మంచి శకునములే”. ప్రముఖ లేడీ డైరెక్టర్ “నందిని రెడ్డి” ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఇక రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రహ్మణ్యన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కి.జె.మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్ని మెప్పించాయి.

వేసవిలో మంచి లవ్& ఫ్యామిలీ ఎంటెర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మే18 న విడుదల కాబోతుంది. ఇక తాజాగా అన్ని మంచి శకునములే సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి నాని , దుల్కర్ సల్మాన్  గెస్ట్ లు  గా హాజరయ్యారు. అంతేకాకుండా డైరెక్టర్లు హను రాఘవపూడి, నాగ్ అశ్విన్, అనుదీప్ కూడా రావడం జరిగింది. ఇక ఈ మూవీ హీరోయిన్ మాళవిక సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్ర యూనిట్ కి తనతో నటించిన నటీనటులని ప్రశంసించింది.

తెలుగులో చాలా చక్కగా మాట్లాడిన మాళవిక తన స్పీచ్ తో అందరిని ఇంప్రెస్స్ చేసింది. స్పీచ్ ముగిసాక చివర్లో మాళవిక నాయర్ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దుల్కర్ సల్మాన్ తో ఒక్క స్టెప్ వేయాలని స్టేజి మీదకు రావాలని కోరగా, వెంటనే దుల్కర్ వచ్చాడు. సీతారామం చిత్రంలోని పాటకు దుల్కర్, మాళవిక నాయర్ డాన్స్ చేసారు. ఇక మాళవిక తన తొలి సినిమా దుల్కర్ సల్మాన్ తోనే చేయడం విశేషం. ఆ చనువుతోనే స్టేజి మీదకు పిలిచింది. దుల్కర్ మలయాళంలో నటించిన “ఉస్తాద్ హోటల్” చిత్రం మాళవిక కు తొలి సినిమా. కాకపోతే అందులో హీరోయిన్ గా కాకుండా సైడ్ రోల్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి “మహానటి” చిత్రంలో భార్యభర్తలుగా నటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు