Custody: ఆ డైరెక్టర్ ని టార్గెట్ చేసిన డార్లింగ్ ఫ్యాన్స్..!

అక్కినేని నాగచైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ సినిమా ఇటీవలే విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విభిన్న కధాంశం ఉన్న సినిమాలకు ప్రసిద్ధి చెందిన వెంకట్ ప్రభు నుండి కథలో కొత్తదనం లేని ఇలాంటి సినిమా ఉహించలేదంటూ విమర్శలొచ్చాయి. ఎంతకాలంగానో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్య, ఈ సినిమా ద్వారా కోలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసాడు. మరో పక్క, ఇప్పటి వరకు తమిళ్ సినిమాలకే పరిమితమైన దర్శకుడు వెంకట్ ప్రభు కస్టడీ ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసాడు. మొత్తానికి ఇద్దరి ఆశలు అడియాశలు అయ్యాయి.

ఈ క్రమంలో కస్టడీ సినిమా ఫ్లాప్ అవ్వటంతో దర్శకుడు వెంకట్ ప్రభుపై వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. వివరాల్లోకి వెళితే, సాహో రిలీజ్ సమయంలో వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ ఇందుకు కారణం అని తెలుస్తోంది. అప్పట్లో సాహోకి పోటీగా సిక్సర్ సినిమా విడుదలైన సందర్భంలో దర్శకుడు వెంకట్ ప్రభు ‘ఈ వీకెండ్ సిక్సర్ గ్యారెంటీ’ అంటూ ప్రభాస్ పై వెటకారంగా కామెంట్ చేశారట సోషల్ మీడియాలో.

ఇపుడు బాక్సాఫీస్ వద్ద కస్టడీ బోల్తా కొట్టడంతో వెంకట్ ప్రభుని టార్గెట్ చేశారు ప్రభాస్ అభిమానులు. ‘ఈ సిక్సర్ ఎలా ఉంది’ అంటూ వెంకట్ ప్రభుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కస్టడీ విషయంలో ఖర్మ సిద్ధాంతం పని చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కస్టడీ సినిమా ఫెయిల్ అవ్వటానికి చాలా కారణాలే ఉండచ్చు గానీ, వెంకట్ ప్రభు ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ చేతిలో బుక్కవ్వటం మాత్రం చచ్చిన పాముని ఇంకా చంపటమే అని చెప్పాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు