Game Changer: ఫస్ట్ సింగిల్ అప్పుడు రిలీజ్ చేస్తారట.

పేరుకి తమిళ దర్శకుడైన తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన దర్శకులలో శంకర్ ఒకరు. శంకర్ చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి అద్భుతమైన బాండింగ్ ఉంది. భారతీయుడు, జెంటిల్మెన్, బాయ్స్ ప్రేమికుల రోజు వంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. శంకర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటేనే అంచనాలు బీభత్సంగా ఉంటాయి. శంకర్ సినిమా అంటే ఒక బ్రాండ్. డైరెక్ట్ గా శంకర్ ఒక తెలుగు సినిమా చేస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కలలు కన్నారు.

మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో కూడా శంకర్ వర్క్ చేయాలని చాలాసార్లు ఆన్ స్టేజ్ తెలిపారు. కానీ అదృష్టం ఇప్పటివరకు చిరంజీవికి దక్కలేదు. కానీ చిరు వారసుడైన రామ్ చరణ్ తేజ్ కు ఆ అదృష్టం దక్కింది. శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో జరగనుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ సినిమా నుంచి లీకైన పిక్స్ కూడా ఈ సినిమాపై అద్భుతమైన అంచనాలను పెంచాయి.

ఇకపోతే ఈ సినిమా నుంచి రీసెంట్ గా జరగండి అని ఒక సాంగ్ లీక్ అయిన విషయం మనకి తెలిసిందే, ఆ పాటను అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది చిత్ర బృందం. అయితే ఆ సాంగ్ ని ఇంకా గ్రాండ్ గా ఇంకా బాగా వచ్చినంత వరకు రిలీజ్ చేయట్లేదు అని ఆ చిత్ర యూనిట్ ఇదివరకే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇకపోతే ఈ పాటని డిసెంబర్ మొదటి వీక్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

- Advertisement -

ఏదేమైనా ఎప్పుడో మొదలైన ఈ సినిమా నుండి ఇప్పటివరకు సరైన అప్డేట్ ఇవ్వని తరుణంలో, చాలామంది ఈ ప్రొడక్షన్స్ హౌస్ ని దిల్ రాజ్ ని కూడా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. ఈ సినిమా ఫస్ట్ సింగల్ కోసం చరణ్ ఫాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ కొన్ని అని వార్య కారణాల వలన షూటింగ్ లేట్ అవడంతో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై సరైన అవగాహన లేదు. మరి ఈ సినిమా నుంచి వచ్చే మొదటి పాట ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో ఇంకొన్ని రోజులు ఆగి చూడాల్సిందే.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు