A.R. Murugadoss: శివకార్తికేయన్ సినిమాలో క్రేజి స్టార్స్

ఒక మంచి సినిమాని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అలాగే మంచి నటలకు కూడా బ్రహ్మరథం పట్టడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఇష్టపడతారు. తెలుగులో హీరోలని ఎలా అయితే ఇష్టపడతారు తమిళ్ హీరోలని కూడా అలానే తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారు. సూర్య, కార్తీ, విక్రమ్, కమలహాసన్, రజినీకాంత్, ధనుష్ వంటి హీరోల సినిమాలు రిలీజ్ అయితే తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. తమిళ్ ప్రేక్షకులు తెలుగు సినిమాలు అంతగా చూస్తారా అంటే చెప్పలేము. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తమిళ్ సినిమా వస్తే ఎగబడి చూస్తారు.

రీసెంట్ టైమ్స్ లో శివ కార్తికేయన్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ మొదలైంది. ఆర్ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ కూడా శివ కార్తికేయన్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొని వచ్చాడు. ఇకపోతే శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తన లాస్ట్ గా నటించినా మహావీరన్ సినిమా తెలుగులో మహావీరుడిగా విడుదలైంది. ఇక్కడ కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు శివ కార్తికేయన్ మురుగదాసుతో సినిమాను చేస్తున్నారు. ఇది శివ కార్తికేయన్ కెరియర్ లో వస్తున్న 23వ సినిమా. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని అనుకుంటున్నట్లు సమాచారం వినిపిస్తుంది. మురగదాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గజిని, తుపాకీ, స్టాలిన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం. మురగదాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. శివ కార్తికేయన్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

మమ్ముట్టి తో పాటు బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తికేయన్ సరసన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తుంది. శ్రీ లక్ష్మి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు