Radhakrishna Kumar: మూడోసారి అవకాశం ఇప్పుడైనా ప్రూవ్ చేసుకుంటాడా.?

ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ని బట్టి ఒక వ్యక్తిని ట్రీట్ చేసే విధానం మారిపోతుందని చాలామందికి తెలిసిందే. ఇకపోతే సక్సెస్ ఉన్నప్పుడు ఉండే మనుషులు ఫెయిల్యూర్ అప్పుడు ఉండరు. సక్సెస్ లో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఫెయిల్యూర్ అప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఒక సక్సెస్ వరస అవకాశాలను ఇస్తే, ఒక ఫెయిల్యూర్ చాలా ఏళ్లు గ్యాప్ అని ఇస్తుంది. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. వాళ్లు చేసిన సినిమాలు కొన్ని పర్వాలేదు అనిపించినా ఇంకొన్ని సినిమాలు మాత్రం బెడిసి కొడతాయి.

యు వి క్రియేషన్స్ సంస్థలో జిల్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు రాధాకృష్ణ కుమార్. మొదటి సినిమాతోనే మంచి డైరెక్టర్ గా పేరు సాధించి ఆ సినిమాను హిట్ దిశగా తీసుకెళ్లాడు రాధాకృష్ణ. ఆ సినిమా తర్వాత రాధాకృష్ణ చేసిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమాపై అందరికీ అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. దానికి తోడు బాహుబలి వంటి సినిమా తర్వాత, అలానే సాహో ఫెయిల్యూర్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి నమ్మకాలన్నీ రాధేశ్యామ్ సినిమా పైన పెట్టుకున్నారు ఆడియన్స్. కానీ థియేటర్స్ కి ఎన్నో అంచనాలతో వచ్చిన ఆడియన్స్ కి ఆ సినిమా షాక్ ఇచ్చింది. ప్రభాస్ లాంటి హీరోతో అలాంటి లవ్ స్టోరీ ఏంటి అనేది చాలామంది అభిప్రాయపడ్డారు.

ఇకపోతే రాధేశ్యామ్ సినిమా తర్వాత ఇప్పటివరకు రాధాకృష్ణ నుంచి ఒక సరైన అప్డేట్ కూడా రాలేదు. ఇప్పుడిప్పుడే రాధాకృష్ణ ఒక కొత్త సినిమాకి సైన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందు రెండు సినిమాలకి అవకాశం ఇచ్చిన యువీ క్రియేషన్స్ మరోసారి రాధాకృష్ణకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాధాకృష్ణ చేయబోయే సినిమాలో గోపీచంద్, శర్వానంద్ వంటి మిడ్ రేంజ్ హీరోలు కనిపించనున్నారు.

- Advertisement -

రాధాకృష్ణ తన సక్సెస్ ని ప్రూవ్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అయితే తనని తాను నిలబెట్టుకొని మరిన్ని కొత్త అవకాశాలను రాధాకృష్ణ సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే ఒక ప్రొడక్షన్స్ ఒకే వ్యక్తిని నమ్మి మూడు సినిమాలు ఇవ్వటం అనేది అద్భుతమైన విషయం కూడా చెప్పొచ్చు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు