Jigarthanda DoubleX: తెలుగు డైరెక్టర్ ను మెప్పించిన తమిళ్ ఫిల్మ్

కార్తీక్ సుబ్బరాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన దర్శకత్వం వహించిన పిజ్జా సినిమా ఒక సెన్సేషన్ చేసిన అని చెప్పొచ్చు. తమిళ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో పాటు తెలుగులో కూడా పిజ్జా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. పిజ్జా సినిమా టేకింగ్ కొత్తగా అనిపించింది తెలుగు ప్రేక్షకులకు. ఒక సినిమాను ఈ పర్సెప్షన్లో చూడొచ్చు అనే విధంగా ఆ సినిమాని తెరకెక్కించాడు కార్తీక్ సుబ్బరాజు.

ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చేసిన ప్రతి సినిమా కూడా టెక్నికల్ గా హై లెవెల్లో ఉండేది. ఆడియన్స్ కి అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమా అంటే ఆడియన్స్ ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తారు. కార్తీక్ సుబ్బరాజు కెరియర్లో వచ్చిన సినిమాలలో జిగర్తాండ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. తమిళ్లో సిద్ధార్థ నటించిన జిగర్తాండ సినిమాని తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో హరీష్ శంకర్ రీమేక్ చేసి ఇక్కడ కూడా మంచి హిట్ అందుకున్నారు.

జిగర్తాండ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అప్పట్లో ఇంతా అంతా కాదు. ఆ తర్వాత సంక్రాంతి బరిలో వచ్చిన పేట సినిమా రజినీకాంత్ కి మంచి కం బ్యాక్ అయింది. ఒక ఫ్యాన్ బాయ్ రజినీకాంత్ ని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించి అద్భుతమైన హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఆ సినిమా తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ కొన్ని సినిమాలు చేసినా కూడా అవేవీ థియేటర్లో రిలీజ్ కాలేదు.

- Advertisement -

కార్తీక్ సుబ్బరాజు నుంచి వచ్చిన లేటెస్ట్ ఫిలిం జిగర్తాండ డబుల్ ఎక్స్.
ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉండేవి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాపై కొన్ని మిశ్రమ స్పందనలు బయటకు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఒక తెలుగు డైరెక్టర్ ఈ సినిమాపై ప్రశంసలు జల్లును కురిపించాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న బాబి ఈ సినిమా గురించి తన ఫీలింగ్ చెప్పుకొచ్చాడు.
లాస్ట్ నైట్ “జిగర్తాండ డబుల్ ఎక్స్” సినిమా చూసా అని, ఇంక్రెడిబుల్ అని కొనియాడారు. లారెన్స్, ఎస్. జే. సూర్య ఆకట్టుకున్నారు అని, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు మాస్టర్ ఫుల్ అని టెక్నికల్ టీమ్ పై కూడా ప్రశంసలు కురిపించారు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు