Jigarthanda2: తమిళ్ లో మాకు తెలుగు సినిమాలు చూడడం అన్నయ్య సినిమాల నుండే స్టార్ట్ అయ్యింది – లారెన్స్

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా డబ్బింగ్ సినిమాల హడావిడే ఉంది. అందులో మంచి అంచనాలతో రిలీజ్ అయిన సినిమా “జిగర్ తండా డబల్ ఎక్స్“. రాఘవ లారెన్స్ , ఎస్.జె.సూర్య మెయిన్ లీడ్స్ గా ఆక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు అందుకుంటుంది. అయితే ఈ సినిమాపై లారెన్స్ చిత్ర బృందం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మూవీ టీమ్ సినిమా తో పాటు కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.

రాఘవ లారెన్స్ మాట్లాడుతూ తాను కొరియోగ్రాఫర్ అవడానికి చాలా కష్టపడ్డానని, తన లైఫ్ లో డ్యాన్స్ కంటే ఏది ఇంపార్టెన్స్ కాదని అన్నాడు. ఆ క్రమంలో తెలుగు సినిమాలు చూడడం 80స్ లోనే స్టార్ట్ చేసానని, అప్పటికి తెలుగు ఇంకా రాదని, కానీ డ్యాన్స్ నాకు ఇష్టం కాబట్టి అన్నయ్య చిరంజీవి సినిమాలే ఎక్కువ చూసేవాడినని లారెన్స్ చెప్పాడు. అప్పట్నుంచే తెలుగు సినిమాలు చూడడం స్టార్ట్ చేసానని, తమిళ్ లో కూడా చిరు సినిమాల నుండే డబ్బింగ్ సినిమాలు ఊపందుకున్నాయని అన్నాడు.

ఇక ఆ వెంటనే ఎస్.జె. సూర్య కూడా మాట కలుపుతూ, తమిళ్ లో మాకు తెలుగు డబ్బింగ్ సినిమాలు చూసే అలవాటు చిరంజీవి గారి సినిమాల నుండే స్టార్ట్ అయ్యిందని అన్నాడు. అప్పట్లో స్టేట్ రౌడీ, యముడికి మొగుడు చిరు డాన్స్ కోసమే పది సార్లు చూశామని లారెన్స్ అన్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు